సబ్బితం జలపాతం వద్ద రక్షణ | Sakshi
Sakshi News home page

సబ్బితం జలపాతం వద్ద రక్షణ

Published Mon, Aug 15 2016 10:22 PM

safety  Actions at sabbitam Waterfall

  • రూ.2లక్షల వ్యయంతో కంచె నిర్మాణం
  • అటవీశాఖాధికారి ప్రేంసాగర్‌
  • రూ.2లక్షల వ్యయంతో కంచె నిర్మాణం
  • అటవీశాఖాధికారి ప్రేంసాగర్‌
  • పెద్దపల్లి రూరల్‌: పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గౌరీగుండాల జలపాతం అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పెద్దపల్లి డివిజన్‌ అటవీశాఖాధికారి ప్రేంసాగర్‌ తెలిపారు. జలపాతం వద్దకు వచ్చే పర్యాటకుల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నారని, వారంత పైనుంచి నీళ్లు వచ్చే ప్రాంతానికి చేరుకుంటుండడంతో అదుపుతప్పి పడి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారన్నారు. ఇప్పటికే ముగ్గురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని వివరించారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రమాదాలను నియంత్రించేందుకు స్టీల్‌ పైప్‌లు, పెన్సింగ్‌ వైర్లతో కంచెను నిర్మించే పనులు చేపడుతున్నట్లు వివరించారు. 
    రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణం
    పెద్దపల్లి–మంథని మార్గంలో ఉన్న సబ్బితం గ్రామంనుంచి జలపాతం ఉన్న గట్టుసింగారం వరకు గల మూడుకిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను ఇంజినీరింగ్‌ అధికారులు సిద్ధం చేశారు. ఇటీవల జలపాతం వద్దకు వచ్చిన  మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్థానిక యువకులు, ప్రజాప్రతినిధులు రహదారి అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రభుత్వానికి పంపించారని సమాచారం.
     
     

Advertisement

తప్పక చదవండి

Advertisement