మా సొంతూరు బూరుగుపల్లి | Sakshi
Sakshi News home page

మా సొంతూరు బూరుగుపల్లి

Published Sun, Nov 22 2015 11:39 AM

మా సొంతూరు బూరుగుపల్లి - Sakshi

కొవ్వూరు : జెమిని టెలివిజన్‌లో క్రియేటివ్ డెరైక్టర్‌గా 2003లో చేరిన పాలకొల్లు సమీపంలోని బూరుగుపల్లికి చెందిన నటుడు జెమిని సురేష్‌గా బుల్లి తెరతో పాటు వెండి తెరలో రాణిస్తున్నాడు. కుమారదేవంలో టైటానిక్ షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సురేష్ విలేకరులతో ముచ్చటించారు.
 
ప్ర : మీ స్వగ్రామం

జవాబు : పాలకొల్లు సమీపంలో బూరుగుపల్లి
 
ప్ర : నట ప్రస్థానం ఎలా మొదలైంది
జవాబు : 2003లో జెమిని టీవీలో క్రియేటివ్ డెరైక్టర్‌గా చేరి 24 ఫ్రేమ్స్ పేరుతో సుమారు 1,600 మందిని ఇంటర్వ్యూ చేశా. ఇది సౌత్ ఇండియూలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది.  
 
ప్ర : సినీ రంగ ప్రవేశం
జవాబు : 2004లో నటుడు శ్రీహరి ప్రోద్బలంతో శ్రీ మహా లక్ష్మి చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యూ
 
ప్ర : పేరు తెచ్చిన సినిమాలు
జవాబు : రెడీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఆగడు
 
ప్ర : మీ చదువు, కుటుంబ ప్రోత్సాహం

జవాబు : ఎంబీఏ చదివాను. అమ్మ సుబ్బలక్ష్మి నన్నెంతగానో ప్రోత్సహించారు  
 
ప్ర : మీ లక్ష్యం
జవాబు : మంచి నటుడిగా గుర్తింపు పొందాలని
 
ప్ర :ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు

జవాబు : సాయిధరమ్ తేజ హీరోగా సుప్రీమ్, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్, కళ్యాణ వైభోగమే, సినిమా హాల్, టైటానిక్ చిత్రాల్లో నటిస్తున్నా.

Advertisement

తప్పక చదవండి

Advertisement