సంగీత సాహిత్యాల చెట్టపట్టాలు | Sakshi
Sakshi News home page

సంగీత సాహిత్యాల చెట్టపట్టాలు

Published Sun, Mar 12 2017 12:01 AM

సంగీత సాహిత్యాల చెట్టపట్టాలు

అలరించిన సంగీత గేయధార
రాజమహేంద్రవరం కల్చరల్‌ : ‘నీవు లేక నేను లేనులే’ అని సంగీత సాహిత్యాలు చెట్టపట్టాలు వేసుకున్నాయి. భావసౌందర్యం, గానమాధుర్యం జట్టుకట్టాయి. ప్రసంగతరంగిణి ఆధ్వర్యంలో శని వారం రాత్రి ఆనం కళాకేంద్రంలో ‘సంగీతసాహి త్య సరస్వతి’ డాక్టర్‌ వి.బి.సాయికృష్ణ యాచేంద్ర నిర్వహించిన వినూత్న ప్రక్రియ ‘సంగీతగేయధార’ సంగీత రసజ్ఞులను, సాహిత్యమర్మజ్ఞులను ఏకకాలంలో మెప్పించింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్‌ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ మాట్లాడుతూ సంగీత సాహిత్యాలు రెంటికీ వేద మే మూలమని తెలిపారు.
సాహిత్యానికి సంబందించినంతవరకు వేదసారం రామాయణంగా అవతరించిందని, సామవేదమంతా సంగీతసారమని అన్నారు. శతావధాని డాక్టర్‌ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు ‘పద’ నిషేధం,’ సంస్కృతాంధ్ర విద్వాంసురాలు డాక్టర్‌ ప్రభల శ్రీవల్లి ‘ పల్లవి పూరణం,’ పంకజలక్ష్మి ‘వర్ణన’, నీలోత్పలకవి యార్లగడ్డ మోహనరావు ‘ఇష్టపద ప్రయోగం’, గేయకవి మహమ్మద్‌ ఖాదర్‌ఖా¯ŒS ‘మంచి ముచ్చట్లు’ (అవధాన ప్రక్రియలో అప్రస్తుత ప్రసంగంతో సరితూగుతుంది) అంశాలను నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన రాగంలో, అడిగిన అంశంపై యాచేంద్ర ఆశువుగా గేయాలను చెప్పారు. ప్రసంగతరంగిణి నిర్వాహకులు సంగీత సాహిత్య కళాభిజ్ఞ బిరుదంతో యాచేంద్రను సత్కరించారు. డాక్టర్‌ టి.శరత్‌చంద్ర, పలువురు ఔత్సాహిక గాయకులు ఘంటసాల పాటలను వినిపించారు. ప్రముఖ శాస్త్రీయసంగీత విద్వాంసుడు తిరుపతి త్యాగరాజు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. నటుడు, గాయకుడు జిత్‌ మోహ¯ŒS మిత్రా తన పాటలతో అలరించారు. డాక్టర్‌ బిక్కిన రామమనోహర్‌ ఈలపాటను వినిపించారు. 

Advertisement
Advertisement