సత్తెన్న పెళ్లికొడుకాయెనే... | Sakshi
Sakshi News home page

సత్తెన్న పెళ్లికొడుకాయెనే...

Published Fri, May 5 2017 11:34 PM

satyadeva marriage in annavaram tomorrow

  • ∙సత్యదేవుని దివ్య కల్యాణానికి సర్వం సిద్ధం
  • ∙రత్నగిరిపై మొదలైన పెళ్లి సందడి
  • ∙నేటి రాత్రి 9.30 నుంచి కల్యాణోత్సవం
  • అన్నవరం : 
    భక్తవరదుడు సత్యదేవుడు వరుడై... సిరులొసగే దేవేరి అనంతలక్ష్మీ అమ్మవారు వధువైన శుభవేళ రత్నగిరి పులకించింది. కల్యాణ కారకులైన స్వామి, అమ్మవార్లే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా దర్శనమిచ్చిన తరుణంలో భక్తకోటి తరించింది. రత్నగిరి వాసుడు  సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారి దివ్యకల్యాణోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి కల్యాణ వేడుకలకు శ్రీకారం చుట్టారు. సత్యదేవుడు, అమ్మవార్లు, పెళ్లి పెద్దలు సీతారాములను సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక ఆసనంపై స్వామి, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాములను ప్రతిష్ఠించారు. పండితులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం చైర్మ¯ŒS ఐ.వి.రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.  సంప్రదాయ ప్రకారం ముత్తయిదువలు పసుపు దంచారు. 
    ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
    రాత్రి ఏడు గంటలకు రత్నగిరి కళావేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం కనులపండువగా జరిగింది. స్వామి వారి తరఫున కొంతమంది పండితులు అమ్మవార్ల తరఫున మరికొంత మంది పండితులు మేము గొప్పంటే... మేము గొప్పని వాదించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు.
    స్వామివారికి పట్టువస్త్రాలు  
    శ్రీసత్యదేవుని కల్యాణానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ డిప్యూటీ ఈఓ బాలాజీ పట్టు వస్త్రాలను దేవస్థానం పండితులకు అందజేశారు.
    నేడు సత్యదేవుని దివ్యకల్యాణం 
    సత్యదేవుడు, అమ్మవార్ల దివ్యకల్యాణోత్సవం రత్నగిరి వార్షిక కల్యాణ వేదికపై శనివారం రాత్రి 9.30 గంటల నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ భక్తులు, మహిళలకు వేర్వేరు ఎ¯ŒSక్లోజర్లు ఏర్పాటు చేశారు. దూరంగా ఉండే భక్తులకు కల్యాణం స్పష్టంగా కనిపించేందుకు టీవీ, స్క్రీ¯ŒSల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కల్యాణ వేదికను, ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్, ఈఓ శుక్రవారం రాత్రి పరిశీలించారు.  
    కల్యాణానికి మంత్రులు, కమిషనర్‌?
    సత్యదేవుని దివ్యకల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, మంత్రి సుజయ కృష్ణ రంగారావు, దేవాదాయశాఖ కమిషనర్‌ వైవీ అనూరాధ, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
     
    అన్నవరంలో నేడు
    వైదిక కార్యక్రమాలు
    తెల్లవారు జాము 3 గంటలకు సుప్రభాతసేవ
    ఉదయం 8 గంటలకు చతుర్వేదపారాయణ
    9 గంటలకు అంకురార్పణ, «ధ్వజారోహణ, కంకణధారణ, దీక్షావస్త్రధారణ 
    రాత్రి 7 గంటలకు కొండ దిగువన స్వామి వారికి వెండి గరుడ వాహనంపై, అమ్మవారికి గజ వాహనంపై,  సీతారాములకు వెండి పల్లకీపై ఊరేగింపు
    రాత్రి 9.30 నుంచి కొండ మీద వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుని దివ్యకల్యాణం
    సాంస్కృతిక కార్యక్రమాలు 
    ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ భజనలు
    8 సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ 
    భక్తిరంజని, 6 నుంచి 7 గంటల వరకూ 
    గాత్ర కచేరీ
     

Advertisement
Advertisement