ఉపకార వేతనాల మంజూరుకు చర్యలు | Sakshi
Sakshi News home page

ఉపకార వేతనాల మంజూరుకు చర్యలు

Published Mon, Oct 17 2016 10:20 PM

Scholarships to grant

– బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్‌
కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని బీసీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను త్వరితగతిన మంజూరు చేయిస్తామని జిల్లా బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్‌ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2016–17 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 51,710 మంది బీసీ  విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్‌ కింద దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను సంబంధిత వెరిఫికేషన్‌ అధికారులు పరిశీలించి ఉపకార వేతనాల మంజూరుకు 19,711 దరఖాస్తులను మాత్రమే పంపారన్నారు. వీటిలో ఇప్పటి వరకు 10,478 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే 11,194 మంది ఈబీసీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్‌ కింద దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 5,608 మందికి మంజూరు చేశామన్నారు.  కళాశాలల్లో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ దరఖాస్తులను సంబంధిత ప్రిన్సిపాళ్లు వెంటనే తమ కార్యాలయానికి పంపాలని హుసేన్‌సాహెబ్‌ కోరారు.
 

Advertisement
Advertisement