చెట్టును ఢీకొన్నస్కూల్ బస్సు | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్నస్కూల్ బస్సు

Published Sat, Jul 2 2016 2:08 AM

చెట్టును ఢీకొన్నస్కూల్ బస్సు - Sakshi

ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
అలియాబాద్ గ్రామ శివారులో ఘటన

కొండాపూర్: డ్రైవర్ అజాగ్రత్త వల్ల స్కూల్ బస్సు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని అలియాబాద్ గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. చెర్లగోపులారం, తేర్పోల్, కొండాపూర్ తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు సంగారెడ్డి పట్టణంలోని కాకతీయ పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా పాఠశాల బస్సులో ఇళ్లకు వెళ్తుండగా అలియాబాద్ శివారు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనేగల చెట్టును ఢీకొంది.

బస్సులో ఉన్న కొండాపూర్‌కు చెందిన శ్రీఖర్(7), శ్రీహర్షిణి(10), గోపులారానికి చెందిన సతీష్ (15), అరుణ్(13), ప్రదీప్ (14), రాజశేఖర్ (15), తేర్పోల్‌కు చెందిన సాయినాథ్ (12)లకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫిట్‌నెస్ లేకపోవడం, అవగాహన లేని డ్రైవర్లు బస్సులు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆర్టీఏ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏబీవీపీ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు అభిలాష్ ఆరోపించారు. ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేసి పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement