స్కూల్‌ బస్సు ఢీకొని విద్యార్థికి గాయాలు | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు ఢీకొని విద్యార్థికి గాయాలు

Published Fri, Aug 12 2016 11:17 PM

school bus crashed

కొత్తూరు : ఇరపాడు గ్రామానికి చెందిన చిన్నారి బి.చాందిని గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. యూకేజీ చదువుతున్న చాందినిని ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొన్నట్టు తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు చేసినట్టు ఏఎస్‌ఐ మస్తాన్‌   తెలిపారు. చాందిని విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు.   కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
 

Advertisement
Advertisement