సైన్స్‌ ఎగ్జిబిషన్‌ విజయవంతం | Sakshi
Sakshi News home page

సైన్స్‌ ఎగ్జిబిషన్‌ విజయవంతం

Published Fri, Apr 14 2017 12:26 AM

సైన్స్‌ ఎగ్జిబిషన్‌ విజయవంతం

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కళాశాల డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌ విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ చెప్పారు. గురువారం కళాశాలలోని నూతన లెక్చరర్‌ గ్యాలరీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ మాట్లాడుతూ 20 రోజుల పాటు కొనసాగిన ఎగ్జిబిషన్‌లో 35 విభాగాలు అద్భుత ప్రదర్శన కనబరిచాయన్నారు. జిల్లా నుంచి గాక రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సైతం సందర్శకులు ప్రదర్శన చూసేందుకు రావడం ఆనందదాయకమన్నారు. ప్రతి విభాగం ఎంతో ఉత్సాహంగా పనిచేయడం వల్లే ఇది విజయవంతం అయ్యిందన్నారు. అనంతరం రిటైర్డ్‌ డీఎంఈ డాక్టర్‌ ఎస్‌ఏ సత్తార్, డాక్టర్‌ వెంకటేష్‌ మాట్లాడారు. చివరగా వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విభాగాధిపతులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాళ్లు  శ్రీదేవి, ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణానాయక్, పి. చంద్రశేఖర్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎగ్జిబిషన్‌ ఇన్‌ఛార్జి జోజిరెడ్డి, పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement