మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులతో ‘మంజీర’ ఎడారి | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులతో ‘మంజీర’ ఎడారి

Published Sat, Aug 6 2016 12:03 AM

మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులతో ‘మంజీర’ ఎడారి - Sakshi

  •  మల్లన్న సాగర్‌ మన ప్రాజెక్టులకు గుండెకాయ
  • కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం
  • రాజకీయదురుద్దేశంతో ప్రతిపక్షాల అడ్డంకులు
  •  నిజాంసాగర్‌ రిజర్వాయర్‌ భూగర్భంలో వేదిక
  •  రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  • నిజాంసాగర్‌ : మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో ఎగువ ప్రాంతాల నుంచి చుక్కనీటి ప్రవాహం లేక మంజీర నది ఏడారిగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంజీర నదికి ఎగువన 47 అక్రమ ప్రాజెక్టులతో సింగూర్, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీళ్లు చేరని దుస్థితి వచ్చిందన్నారు. అలాగే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 400 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వలన శ్రీరాంసాగర్‌ పరిస్థితి అన్నమో రామచంద్రా అన్నట్లు మారిందన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని అదుకునేందు కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. రాజకీయ భవిషత్తు ఉండదన్న దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి మల్లన్నసాగర్‌ సాధన సదస్సును పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొ న్నారు. ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన మల్లన్నసాగర్‌ సాధన సదస్సు కోసం శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్ల కింద రిజర్వాయర్‌ భూగర్భంలో సభాస్థలాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు 20 వరదగేట్ల వద్ద ఆరేడ్‌ శివారులో స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు వేసుకున్నారన్నారు. కృష్ణా నది పరీవాహకంలో జురాల, ఆదిలాబాద్‌ జిల్లాలో కడెం ప్రాజెక్టులు పూర్తి స్థాయి జలకళను సంతరించుకున్నాయన్నారు. కాని మంజీర, గోదారి నదీ పరీవాహకంలో సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీరు చేరని పరిస్థితులు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల వల్లే గోదావరి, మంజీరలు నీళ్లులేక ఎండాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ను అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలకు పుట్టగతులుండవన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రెండేళ్ల లో మల్లన్నసాగర్‌ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ సాధన సదస్సుకు అన్ని జిల్లాల రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. మంత్రి వెంట జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌రాజు, టీఆర్‌ ఎస్‌ నాయకులు వినయ్‌కుమార్, మోహన్‌రెడ్డి, దుర్గారెడ్డి, విఠల్, పోచారం భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, నార్ల సురేశ్, రజనీకాంత్‌రెడ్డి, అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నర్సాగౌడ్, ఎజాజ్‌ తదితరులు న్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement