గర్భస్థ లింగ నిర్ధారణ నేరం | Sakshi
Sakshi News home page

గర్భస్థ లింగ నిర్ధారణ నేరం

Published Thu, Sep 29 2016 12:12 AM

sexual tests crime

అనంతపురం మెడికల్‌ : గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరిత్యా నేరమని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి లింగ నిర్ధారణ నిషేధ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా లింగ నిర్ధారణ చేసే ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం స్కానింగ్‌ కేంద్రాల రిజిస్ట్రేషన్ల పెండింగ్, ఇటీవల నగరంలోని ఓ ఆస్పత్రిపై వచ్చిన ఫిర్యాదు, తనిఖీ తదితర అంశాలపై చర్చించారు.

అల్ట్రాసోనాలజిస్ట్‌ స్క్రీనింగ్‌ పరీక్ష అక్టోబర్‌ 16న జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కానింగ్‌ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్‌ సుధీర్‌బాబు, కమిటీ సభ్యులు డాక్టర్‌ రామసుబ్బయ్య, డాక్టర్‌ బాలకుమారి, డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డాక్టర్‌ మల్లీశ్వరి, న్యాయవాది బాలన్న, డెమో హరిలీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement