అడిషనల్‌ ఎస్పీగా షేకా​‍్షవలి | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ ఎస్పీగా షేకా​‍్షవలి

Published Thu, Mar 30 2017 11:39 PM

shaikshavali as additional sp

– కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో బాధ్యతలు స్వీకరణ
 
కర్నూలు: కర్నూలు అడిషనల్‌ ఎస్పీగా (అడ్మిన్‌) పి.షేకా​‍్షవలి బాధ్యతలు స్వీకరించారు. శివరామ్‌ప్రసాద్‌ పదవీవిరమణ పొందడంతో ఆ స్థానంలో షేకా​‍్షవలిని నియమిస్తూ వారం రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీఐడీ హెడ్‌ ఆఫీసులో పనిచేస్తూ ఈయన కర్నూలుకు బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా, వెలుగప్ప మండలం, శ్రీరంగపురం ఈయన స్వస్థలం. అనంతపురం కలెక్టర్‌ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా, సీనియర్‌ అసిస్టెంటుగా పది సంవత్సరాల పాటు పని చేశారు. 2001లో గ్రూప్‌–1 ఎంపికై మొదట చిత్తూరు డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆఫీసులో పని చేస్తూ ప్రమోషన్‌పై హైదరాబాద్‌కు బదిలీ అయి ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లోని మెడికల్‌ హెల్త్‌ డిపార్టుమెంటులో పని చేశారు. 2011లో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీనియార్టీ మేరకు పోలీసు శాఖలో డీఎస్పీగా చేరి అప్పాలో శిక్షణ పూర్తి చేసుకొని, 2012లో విశాఖపట్టణం ప్రాక్టికల్‌ ట్రైనింగ్, గ్రేహౌండ్స్, 2013లో సీఐడీ హైదరాబాద్, 2014లో గుంటూరు రైల్వేలో పని చేశారు. 2015లో మళ్లీ సీఐడీ హైదరాబాద్‌ వెళ్లి ఇప్పటి వరకు పనిచేశారు. అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొంది కర్నూలుకు బదిలీపై ఏఎస్‌పీగా నియమితులయ్యారు. గురువారం ఉదయం జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణను కలిసి పూల బోకే ఇచ్చి, మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సీఐలు అడిషనల్‌ ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  
 

Advertisement
Advertisement