శ్రీశైలం లో 17 నుంచి శివరాత్రి వేడుకలు | Sakshi
Sakshi News home page

శ్రీశైలం లో 17 నుంచి శివరాత్రి వేడుకలు

Published Sun, Feb 5 2017 10:23 PM

శ్రీశైలం లో 17 నుంచి శివరాత్రి వేడుకలు - Sakshi

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త..ఆదివారం విలేకరులకు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 17 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించేందుకు 22వ తేదీ నుంచి స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం 18వ తేదీన , రాష్ట్ర ప్రభుత్వం 21వ తేదీన.. పట్టువస్త్రాలను సమర్పిస్తుందని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం 24వ తేదీ వస్తుందని, అ రోజు రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం,  రాత్రి 10.30 గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వమిస్తామని చెప్పారు.  

Advertisement
Advertisement