‘సీమ’ను కాపాడుకుందాం | Sakshi
Sakshi News home page

‘సీమ’ను కాపాడుకుందాం

Published Sun, Jul 24 2016 10:24 PM

‘సీమ’ను కాపాడుకుందాం - Sakshi

బద్వేలు అర్బన్‌:
 రాయలసీమ నాలుగు జిల్లాలు ఎడారి కాకముందే సీమ రాజకీయ నాయకులలో, ప్రజలలో కదలిక రావాల్సిన సమయం ఆసన్నమైందని కృష్ణాజలాల సాధన ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర నాయకులు సీహెచ్‌. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం  స్థానిక ఎన్‌జీవో హోంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రాజెక్టుల తీరు– మన బాధ్యత అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు ఎందరూ మారిన సీమ ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. నిత్యం కరువు కాటకాలతో  బాధపడుతున్న సీమ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్‌ అంధకారమవుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 850 అడుగుల నీటిమట్టం సాధించేందుకు   ఉద్యమించాలని ఇందుకోసం దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాజకీయాలకు అతీతంగా కలవాలన్నారు. రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కావాలంటే అందరూ ఏకమై ప్రధాని వద్దకు ప్రతినిధి బృందం వెళ్లి ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేవిధంగా ఒత్తిడి తేవాలన్నారు.  కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోన పుల్లారెడ్డి , సాహితీవేత్త గానుగపెంట హనుమంతరావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మహబూబ్‌సాహెబ్, రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement