ఏకకాలంలో బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి | Sakshi
Sakshi News home page

ఏకకాలంలో బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి

Published Fri, Jul 29 2016 1:09 AM

Simultaneously the bank loans to be written off

సత్యనారాయణపురం (చర్ల), రైతుల బ్యాంకు రుణాలను ఏకకాలంలోనే మాఫీ చేసి రైతులందరికీ కొత్త రుణాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం అనుబంద తెలంగాణా రైతు సంఘం (ఏఐకేఎస్‌)   ఆద్వర్యంలో మండలంలోని సత్యనారాయణపురంలో దర్నా నిర్వహించారు. సత్యనారాయణపురంలోని స్టేట్‌బ్యాంబ్‌ ఆప్‌ హైదరాబాద్‌ సత్యనారాయణపురం బ్రాంచి ముందు బైటాయించిన రైతులు, తెలంగాణా రైతు సంఘం నాయకులు ప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణా రైతు సంఘం డివిజన్‌ కార్యదర్శి ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ... ఖరీప్‌ కాలం ఆరంభమయ్యి రెండు నెలలు కావస్తున్నా రైతాంగానికి ఇంత వరకూ పంట రుణాలు అందలేదని ఆయన అన్నారు. ఈ పరిస్థితితుల్లో రైతులు సాగు ఎలా ముందుకు సాగుతుందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విడత వారీగా పంటరుణాలను మాఫీ చేస్తామని ప్రకకటించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ములను చెల్లించ లేదని ఆయన అన్నారు. తక్షణమే రైతుల రుణమాఫీకి సంబందించిన సొమ్ములను ఒకే సారి జమ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని కౌలు రైతులు, పోడు సాగుదారులకు కూడా పంట రుణాలను మంజూరి చేయాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే  రైతుల పక్షాణ ఆందోళనలను ఉదతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యాక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాయిపూడి యేసురత్నం, డివిజన్‌ కమిటీ సభ్యులు కొలగాని బ్రహ్మాచారి, లంకా వెంకట్, నాయకులు కోటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement