ఫూలే జీవితంపై సినిమా | Sakshi
Sakshi News home page

ఫూలే జీవితంపై సినిమా

Published Wed, Jul 27 2016 9:34 PM

ఫూలే జీవితంపై  సినిమా

 
ఏఎన్‌యూ: భారతీయ సమాజంలోని సామాజిక రుగ్మతలను రూపుమాపేందకు ఉద్యమించిన తొలి సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావ్‌ఫూలే జీవిత చరిత్రపై సినిమా తీయటం అభినందనీయమని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ఫూలే సినిమా షూటింగ్‌ సందర్భంగా చిత్ర యూనిట్‌ సభ్యులు బుధవారం సాయంత్రం యూనివర్సిటీలోని ఫూలే అధ్యయన కేంద్రాన్ని సందర్శించారు. మహాత్మా ఫూలేకి సంబంధించిన పలు అంశాలను ఫూలే అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య అబ్ధుల్‌నూర్‌బాషాతో చర్చించారు. చిత్ర నిర్మాణానికి సంబంధించిన సాహిత్యాన్ని సేకరించారు. అనంతరం  దర్శకుడు డాక్టర్‌ పీఎం సుందరరావు, చిత్ర యూనిట్‌ సభ్యులు వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఫూలేపై తెలుగులో సినిమా తీయటం తెలుగు జాతికి మంచి సేవ చేయటమేనన్నారు. సీహెచ్‌ నాగేశ్వరరావు, పవన్, పి యోహాను తదితరులు వీసీని కలిసిన వారిలో ఉన్నారు. 
 
 

Advertisement
Advertisement