శిరోముండనం బాధితుల రిలే దీక్షలు | Sakshi
Sakshi News home page

శిరోముండనం బాధితుల రిలే దీక్షలు

Published Thu, Oct 27 2016 11:33 PM

siromundanam issue and deeksha

  • నిందితుల కొమ్ము కాస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..
  • శిబిరాన్ని ప్రారంభించిన రిపబ్లిక¯ŒS పార్టీ నేత మోకా
  • వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్‌) : 
    వెంకటాయపాలెం దళిత యువకుల శిరోముండనం కేసు విచారణను జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. బాధితులు, ప్రజాసంఘాల నాయకులు, దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద  ఈ దీక్షలు చేపట్టారు.దీక్షా శిబిరాన్ని యానాంకు చెందిన రిపబ్లిక¯ŒS పార్టీ సీనియర్‌ నాయకుడు మోకా మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టులో విశేష కృషి చేసిన బొజ్జా తారకం మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు. ఈ పోరాటాన్ని ముందుకు నడిపి నిందితులకు శిక్షలు పడినపుడే తారకానికి నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. దళిత ఐక్యపోరాట వేదిక నాయకులు నీలం మధుసూదనరావు, ఐఎఫ్‌టీయు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, మాల మహానాడు నాయకుడు తాడి బాబ్జీ. జై భీమ్‌ దళిత సేవా సంఘం నాయకులు గుబ్బల శ్రీను, దడాల వెంకటరమణ, చెట్లర్‌ కర్ణ  ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు కొమ్ము కాస్తున్న  ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు సైతం తాము వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. తొలిరోజు దీక్షలో శిరోముండనం బాధితులు  కోటి చినరాజు, చల్లపూడి పట్టాభి రామయ్య, గ్రామస్తులు దడాల రవికుమార్, రేవు అప్పారావు, దడాల కృష్ణమూర్తి, బొడ్డు కృష్ణమూర్తి, కాకర విష్ణుమూర్తి, గుత్తుల వెంకటరమణ, ఇసుకపట్ల శ్యామల కూర్చున్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకుడు గుబ్బల ఆదినారాయణ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సంఘ జిల్లా కార్యదర్శి ఆర్‌ రాఘవులు, బీసీ సంఘం నాయకుడు వాసంశెట్టి శ్యాం, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు, జిల్లెళ్ల వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్‌ నాయకుడు అంబటి కృష్ణ, గెద్దాడ సూరిబాబు పాల్గొన్నారు. 
     

Advertisement
Advertisement