సర్పాల సయ్యాట | Sakshi
Sakshi News home page

సర్పాల సయ్యాట

Published Wed, Aug 17 2016 9:07 PM

సయ్యాట ఆడుతున్న పాములు - Sakshi

కలకడ: రెండు భారీ సర్పాలు గంటల తరబడీ సయ్యాటలో మునిగితేలాయి. చిత్తూరు జిల్లా కలకడ మండలం యర్రయ్యగారిపల్లె వద్ద చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారి పక్కన ముళ్ల పొదల్లో బుధవారం ఇది చోటుచేసుకుంది. పాముల సయ్యాటను గమనించిన మోటార్‌ సైక్లిస్టులు, వాహనచోదకులు తమ ప్రయాణానికి కాసేపు పుల్‌స్టాప్‌ పెట్టి వీటిని వీక్షించారు.  పది అడుగుల పైగా పొడవున్న నాగుపాము, జెర్రిపోతు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పెనువేసుకుని సయ్యాటతో మెలికలు తిరుగుతుండటం కొందరు గమనించారు. ఒకరిని చూసి ఒకరు అక్కడేదో జరుగుతోందనే కుతూహలంతో అక్కడికి చేరుకున్నారు. పాముల సయ్యాట చూసి వామో! ఎంత పే...ద్ద పాములో అంటూ గగుర్పాటుతో తిలకించారు. కొందరు సెల్‌ కెమెరాల్లో వాటి సయ్యాటను చిత్రీకరించారు. కొందరు గట్టిగా అరచినా, అలజడి చేసినా పాములు పట్టించుకోలేదు. చివరకు సాయంత్రం చీకట్లు ముసిరినా సయ్యాటను వీడలేదు.  ప్రజలు మాత్రం వెనుదిరిగారు. గంటల పాటు కొనసాగిన వాటి సయ్యాటను వందలాది మంది వీక్షించారు.

Advertisement
Advertisement