Sakshi News home page

కావలికారుల సమస్యలు పరిష్కరించాలి

Published Tue, Aug 2 2016 5:10 PM

కావలికారుల సమస్యలు పరిష్కరించాలి - Sakshi

కావలికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అమీరొద్దీన్‌

బషీరాబాద్‌: గ్రామాల్లో రాత్రీ పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న కావలికారుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కావలికారుల (రెవెన్యూ సహాయకుల) సంఘం జిల్లా అధ్యక్షుడు అమీరొద్దీన్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మండల కావలికారుల సంఘం అధ్యక్షుడు అనంతయ్య ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ తులసీరాంకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలికారులను (రెవెన్యూ సహాయకుల)లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రతినెలా రూ.15 వేల వేతనాలను అందించాలన్నారు. తక్షణమే 010 పద్దు కింద పాత పద్ధతిలో వేతనాలు చెల్లించాలన్నారు. కావలికారులకు మెరుగైన వైద్యం అందించేందుకు జీఓ 670ను సవరించాలన్నారు. వాటా బంది పద్ధతి ద్వారా కావలికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటా బంది సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

         అర్హులైన వారికి ప్రభుత్వం జీఓ నంబర్‌ 39 ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. మృతిచెందిన కావలికారుల కుటుంబసభ్యులకు బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రతినెలా జీతాల బడ్జెట్‌ను వెంటనే రిలీజ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కావలికారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న జిల్లా వ్యాప్తంగా ఉన్న కావలికారులతో బహిరంగసభ నిర్వహించనున్నామన్నారు. సమస్యల సాధన కోసం జరిగే నిర్వహించే కార్యక్రమానికి జిల్లాలో ఉన్న కావలికారులు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కావలికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంజిలయ్య, గౌరవ అధ్యక్షుడు ఎల్లప్ప, కావలికారుల సంఘం నాయకులు బందెప్ప, యకాంబరి, వడిచర్ల నగేష్‌, జగ్గప్ప, నర్సింలు, నర్సప్ప, మొగులప్ప, శేఖర్‌, రాజమణి, శివప్ప తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement