సోమసుందర్‌కు జిల్లాతో అనుబంధం | Sakshi
Sakshi News home page

సోమసుందర్‌కు జిల్లాతో అనుబంధం

Published Sat, Aug 13 2016 8:33 PM

సోమసుందర్‌కు జిల్లాతో అనుబంధం

ఒంగోలు కల్చరల్‌: తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పిన ప్రతిభావంతులైన కవుల్లో ఒకరైన అవంత్స సోమసుందర్‌ శుక్రవారం కాకినాడలో అనారోగ్యంతో మృతిచెందడం ఆయన అభిమానులకు దిగ్భ్రాంతికి గురిచేసింది. వజ్రాయుధం వంటి రచనలతో ఆయన తనకంటూ ఒక  పేజీని సాహిత్య చరిత్రలో సృష్టించుకున్నారు. జిల్లాకు చెందిన డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు, డాక్టర్‌ «ధారా రామనా«థ శాస్త్రి, ఈమని దయానంద, మల్లవరపు జాన్, నల్లూరు వెంకటేశ్వర్లు వంటివారితో ఆయనకు ప్రగాఢ సాన్నిహిత్యం ఉంది.

నాగభైరవకు ఆయనంటే ప్రత్యేక అభిమానం. 1974లో జిల్లాలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో సోమసుందర్‌ పాల్గొన్నారు. 1952లో ఒంగోలులో నాయని నరసింహారావు ఇంటిలో ఏర్పాౖటెన కవిసమ్మేళనంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి తదితరులతోపాటు సోమసుందర్‌ కూడా పాల్గొని సన్మానం పొందారు. అవంత్స సోమసుందర్‌ మృతి తీరని లోటని ప్రముఖ కవి డాక్టర్‌ బీరం సుందరరావు నివాళి అర్పించారు.

మధుర సాహిత్య భారతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాౖటెన మల్లవరపు జాన్‌ వర్ధంతి సభలో పాల్గొన్న వక్తలు అవంత్స సోమసుందర్, డాక్టర్‌ ధారా రామనాథ  శాసి్త్రల స్మృతికి ఘనంగా నివాళులర్పించారు. పలు సాహిత్య సంస్థల నిర్వాహకులు కూడా అవంత్సకు స్మృత్యంజలులు ఘటించారు.  

Advertisement
Advertisement