రైల్వే కోర్టుకు హాజరైన స్పీకర్‌ | Sakshi
Sakshi News home page

రైల్వే కోర్టుకు హాజరైన స్పీకర్‌

Published Tue, Aug 30 2016 12:07 AM

Speaker of the railway court appearance

కాజీపేట రూరల్‌ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013లో వరంగల్‌ రైల్వేస్టేçÙన్‌లో చేపట్టిన రైల్‌ రోకోకు సంబంధించిన నమోదైన కేసులో స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి సోమవారం కాజీపేటలోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. స్పీకర్‌తో పాటు అచ్చ వినోద్, దండు దయాసాగర్, వి.సత్యనారాయణ, దిడ్డి నరేందర్, బొల్లం సంపత్‌కుమార్‌ కోర్టుకు హాజరు కాగా, కేసును డిసెంబర్‌ 5వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. అనంతరం కోర్టు బయట స్పీకర్‌ విలేకరులతోమాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణవాదిగా తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశానని అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులపై రైల్వే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. అయితే, చట్టం, న్యాయాలపై అపారమైన గౌరవం ఉన్నందున కోర్టుకు వచ్చానని తెలిపారు. కాగా, కాజీపేట రైల్వే కోర్టుకు వచ్చిన స్పీకర్‌ మధుసూదనచారిని విశ్వ బ్రాహ్మణ సంఘం బాధ్యులు శృంగారపు భిక్షపతి, సల్లూరి లక్ష్మీనారాయణ, కొండోజు సారంగం, రవి, రామ్‌మోహన్‌ తదితరులు సన్మానించారు. 

Advertisement
Advertisement