అవసరమైతే ఆఫ్‌లైన్‌లో ఎస్‌పీఎస్ సర్వే | Sakshi
Sakshi News home page

అవసరమైతే ఆఫ్‌లైన్‌లో ఎస్‌పీఎస్ సర్వే

Published Sat, Jul 16 2016 2:23 AM

అవసరమైతే ఆఫ్‌లైన్‌లో ఎస్‌పీఎస్ సర్వే

తుని (తునిరూరల్) : సాంకేతిక సమస్యలతో ప్రజా సాధికార సర్వే (ఎస్‌పీఎస్) సక్రమంగా జరగడం లేదని అవసరమైతే ఆఫ్‌లైన్లో ఈ సర్వే నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు.  ఆయన శుక్రవారం తుని పట్టణం దివాణం వీధిలో నిర్వహిస్తున్న ఎస్‌పీఎస్‌ను పరిశీలించారు. సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధిగమించేందుకు సాంకేతికతను జోడిస్తున్నట్టు తెలి పారు. ఆధార్, రేషన్, బ్యాంక్, ఓటర్, డ్రైవింగ్ లెసైన్స్ కార్డులు వంటి 14 సర్వీసులకు చెందిన 84 అంశాలను నమోదు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఐరిష్ సేకరణతో సమస్య తలెత్తుతోందన్నారు.

జిల్లాలో 42లక్షల మంది వివరాలను ఈ సర్వేలో సేకరించాల్సి ఉండగా ఇంతవరకూ 31వేల మంది వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయగలిగామన్నారు. ఆయనవెంట తహసీల్దార్ బి.సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్‌వీరమణ తదితరులు ఉన్నారు.
 
ఆగస్టు 15 లోగా ప్రజాసాధికార సర్వే పూర్తి
గొల్లప్రోలు: జిల్లాలో ప్రజాసాధికార సర్వే ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఎస్. సత్యనారాయణ  తెలిపారు. ఆయన శుక్రవారం గొల్లప్రోలు, చేబ్రోలు గ్రామాల్లో ప్రజాసాధికారసర్వేను పరిశీలించారు. సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ఎన్యూమరేటర్లను ఆడిగి తెలుసుకున్నారు.

మొదటి విడతగా 40మండలాలు, 12మున్సిపాల్టీల్లో 2,707 బృందాలు ఈ సర్వే చేస్తున్నాయన్నారు. మొదటి దశ సర్వే జూలై 30లోగా పూర్తి చేయాలని,  నెట్‌వర్క్‌లేని ఏజెన్సీ తదితర 24మండలాల్లో సర్వేను ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వై. జయ, ఎంపీడీఓ పి. విజయథామస్, డిప్యూటీ తహసీల్దార్ రామరాజు, గొల్లప్రోలు కమిషనర్ వేగి సత్యనారాయణదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement