దుర్గగుడిలో 9న ఏరువాక పౌర్ణమి | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో 9న ఏరువాక పౌర్ణమి

Published Tue, Jun 6 2017 11:53 AM

Sri Durga Malleswara Swamy temple programme schedule

► నాగలి, బసవ ప్రత్యేక పూజలు
► తొలి సారిగా దుర్గగుడిలో నిర్వహణ

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమం) : విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం(దుర్గగుడి)లో ఈ నెల 9వ తేదీ జేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఏరువాక పౌర్ణమి నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అమ్మవారి ఆలయం మహా ప్రాకారం సమీపంలోని కనకదుర్గనగర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పంట భూములను దున్నే నాగలి, బసవన్నలకు ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు విశేష పూజలు నిర్వహించేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. జేష్ఠమాస పౌర్ణమి రోజున రైతులు  సాగు పనులు ప్రారంభిస్తారు. దుర్గగుడి భూములను కౌలుకు తీసుకుని సాగుచేస్తున్న రైతులు ఏరువాక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఇప్పటికే ఆలయ అధికారులు ఆహ్వానం పంపించారు. చిన్న ఓగిరాల, పెద్ద ఓరిగాలకు చెందిన పలువురు రైతులు దేవస్థానానికి ఆకుకూరలు, కాయగూరలను విరాళంగా అందచేస్తుంటారు. దేవస్థానం వాటిని అన్నదానం, శాకంబరీ దేవి ఉత్సవాలల్లో వినియోగిస్తుంది. ఆ రైతులు కూడా ఏరువాక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement