ప్రతిభా నైపుణ్యాలు అవసరం | Sakshi
Sakshi News home page

ప్రతిభా నైపుణ్యాలు అవసరం

Published Sun, Dec 11 2016 11:49 PM

srinivasa ramanujan birth centenary in srit

 
ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి 
బుక్కరాయసముద్రం: విద్యార్థులకు ప్రతిభా నైపుణ్యాలు ఎంతో అవసరమని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల సీఈఓ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ ఇంటెలిజెస టెస్ట్‌  నిర్వహించారు.   జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ప్ర«థమ, ద్వితీయ సంత్సరం చదువుతున్న 1924 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలైనవారికి ఈ నెల 22న   శ్రీనివాస రామానుజ¯ŒS జయంతిని  పురస్కరించుకుని బహుమతులు అందజేస్తున్నామని ఆయన తెలిపారు.  

మొదటి బహుమతిగా ల్యాప్‌టాప్, ద్వితీయ బహుమతిగా 10 ఇ¯న్చెస్‌ ట్యాబ్‌లెట్, తృతీయ బహుమతిగా 7 ఇంచుల ట్యాబ్‌లెట్‌  ప్రదానం చేస్తామన్నారు. వీటితో పాటు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఏఓ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సుబ్బారెడ్డి, నిజాం భాషా, అద్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement