నేడు ఎల్‌ఎండీకి ఎస్సారెస్పీ నీరు | Sakshi
Sakshi News home page

నేడు ఎల్‌ఎండీకి ఎస్సారెస్పీ నీరు

Published Thu, Aug 4 2016 10:19 PM

srsp water come to tommarow

  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • 15టీఎంసీలు దాటితేనే ఎల్‌ఎండీ దిగువకు నీరు
  • ఎస్సారెస్పీ సీఈ శంకర్‌
  • తిమ్మాపూర్‌:  ఎస్సారెస్పీ నుంచి విడుదల చేసిన నీరు ఎల్‌ఎండీకి శుక్రవారం చేరుతాయని ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌ తెలిపారు. ఎల్‌ఎండీలోని ఏసీఈ ఆఫీసులో గురువారం విలేకరులతో మాట్లాడారు. 90 టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 13,086 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..  46.45టీఎంసీ(1077.70అడుగులు)ల నీరు ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు 4500 క్యూసెక్కులు, వరద కాలువకు 6075 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. వర్షాలు పడుతున్నప్పుడు, నీటివిడుదల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసిన నీరు గురువారం మధ్యాహ్నం 45 కిలోమీటర్లు(కోరుట్ల) వరకు వచ్చాయని పేర్కొన్నారు. ఎల్‌ఎండీకి శుక్రవారం ఉదయం వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. పోచంపాడ్‌ వద్ద  రెండింటి ద్వారా ప్రస్తుతం 8యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నెల 10తేదీ తరువాత రైతులు కోరితే ఎల్‌ఎండీ ఎగువ ప్రాంత ఆయకట్టుకు ఎనిమిది రోజులు ఆన్, ఏడు రోజులు ఆఫ్‌ పద్ధతిన ఎస్సారెస్పీ నుంచి నీటిని ఇస్తామని తెలిపారు. వీటికి సంబంధించి ఖరీఫ్‌ ప్రణాళికలను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో పెరిగితే గరిష్టంగా కాకతీయ కాలువ ద్వారా 7వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు ఇచ్చే అవకాశం ఉందని, అయితే శభాష్‌పల్లె బ్రిడ్జి కారణంగా వరదకాలువకు 10వేల వరకే వదులుతామని పేర్కొన్నారు. సారంగపూర్‌ మండలం రోళ్లవాగు కింద 15వేల ఎకరాల ఆయకట్టు ఉందని, ఇక్కడ తాగునీటికి ఇబ్బంది  ఉండడంతో రోళ్లవాగుకు నీళ్లు ఇస్తామన్నారు.ప్రస్తుతం 2.50టీఎంసీలున్న ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి 15టీఎంసీల నీరు చేరుకోగానే ప్రభుత్వ నిర్ణయం మేరకు దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండొచ్చని చెప్పారు. ఎస్సారెస్పీ పరిధిలో 2లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యముండగా.. ఇప్పటి వరకు 1.10లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement