ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభం

Published Thu, Aug 25 2016 10:47 PM

starts pratista festivals

పెనుగొండ :102 అడుగుల ఆలయంలో 90 అడుగులు, 45 టన్నుల బరువుండే వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విగ్రహంలో భాగంగా తయారు చేయించిన అమ్మవారి నిజ పాదుకల బరువు 1.5 టన్నులన్నారు. 
పెనుగొండలోని 102 అడుగుల వాసవీ శాంతి థాంలో 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహ ఏర్పాటులో భాగంగా గురువారం నిజ పాదుకల ప్రతిష్ఠాపన ఉత్సవాలను ప్రారంభించారు. 1.5 టన్నుల బరువు కలిగిన నిజ పాదుకలను శనివారం ప్రతిష్టించనున్నారు. తొలుత ప్రతిష్ఠాపన ఉత్సవాలను అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పీఎన్‌ గోవిందరాజులు ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను పెనుగొండ పీఠాథిపతి కృష్ణానంద పురిస్వామి జీ, బ్రహ్మశ్రీ రామడుగుల లక్ష్మీ నరసింహమూర్తి శిష్యబృందం పర్యవేక్షణలో నిర్వహించారు. 
ప్రపంచ ప్రసిద్ధక్షేత్రంగా పెనుగొండ : గోవిందరాజులు 
ఈ సందర్భంగా గోవిందరాజులు విలేకరులతో మాట్లాడారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ మాత జన్మస్థలమైన పెనుగొండను ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రూ.100 కోట్లతో వాసవీ శాంతి థాంను అభివృద్ధి చేయడానికి 2002లో ప్రణాళిక రూపొందించామని, ఇప్పటివరకూ రూ.45 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. 102 అడుగుల ఆలయంలో 90 అడుగులు, 45 టన్నుల బరువుండే వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విగ్రహంలో భాగంగా తయారు చేయించిన అమ్మవారి నిజ పాదుకల బరువు 1.5 టన్నులన్నారు. ఈ పాదుకలను తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ఊరేగించగా కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్టు చెప్పారు. యాత్ర ముగియడంతో ప్రతిష్ఠాపన చేస్తున్నట్టు చెప్పారు. అమ్మవారి పూర్ణ విగ్రహ ప్రతిష్ఠాపన జనవరిl30న నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అమ్మవారి విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీల చేతులమీదుగా ప్రారంభింపచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ట్రస్ట్‌ ద్వారా సమాజ సేవ చేస్తున్నట్టు తెలిపారు. ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.రామమూర్తి, ఉపాధ్యక్షుడు ఎంవీ నారాయణ గుప్త, కార్యదర్శి కేఆర్‌ కృష్ణ, కోశాధికారి ఎన్‌.శ్రీనివాసమూర్తి, కోట్ల వెంకటేశ్వరరావు, ఆర్‌పీ రవిశంకర్, ఎస్‌.సతీష్, టి.శ్రీనివాసమూర్తి, బీసీఎస్‌ నారాయణ, డి.పార్ధసారథి పాల్గొన్నారు.
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement