సంక్షేమ పథకాల్లో రాష్ట్రం అగ్రగామి | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల్లో రాష్ట్రం అగ్రగామి

Published Tue, May 2 2017 11:22 PM

సంక్షేమ పథకాల్లో రాష్ట్రం అగ్రగామి - Sakshi

► అన్ని కులాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
►  లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుతో తాగునీటి సమస్యకు చెక్‌
►  కేసీఆర్‌ సీఎం కావడం మన అదృష్టం
► మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌

కేశంపేట(షాద్‌నగర్‌): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అల్వాల గ్రామంలో బీరప్ప ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని ముఖ్యకూడలిలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ధి పథకాల అమల్లో రాష్ట్రం అగ్రాగామిగా ఉందన్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తయితే తాగునీటి సమస్య తీరి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

అదేవిధంగా గ్రామాల్లోని 18 సంవత్సరాలు నిండిన గొల్ల,కురుమలు సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి 75శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 గొర్రెలను, ఒక పొట్టేలును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్రంలోని అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకొన్న కేసీఆర్‌ ముఖ్య మంత్రిగా ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. అన్ని కులవృత్తులు అభివృద్ధి చెందేలా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.

కా ర్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మార్కెట్‌కమిటీ చైర్మెన్‌ లిం గారం యాదమ్మ, వైస్‌ చైర్మెన్‌ వెంకట్‌రెడ్డి, సర్పంచి విజయేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సురేందర్, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్‌గౌడ్, లక్ష్మీనారాయణ , రాంబల్‌ నాయక్, జమాల్‌ఖాన్, నారాయణరెడ్డి, వేణుగోపాలాచా రి, యాదగిరి రావు, కొత్తూరు, కొందూ రు టీఆర్‌ఎస్‌ నాయకులు,పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement