ప్రజాజీవనానికి భంగం కలిగించొద్దు | Sakshi
Sakshi News home page

ప్రజాజీవనానికి భంగం కలిగించొద్దు

Published Mon, Sep 5 2016 1:20 AM

ప్రజాజీవనానికి భంగం కలిగించొద్దు

 
  • చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు నిషేధం
  • ఏఎస్పీ బి.శరత్‌బాబు
నెల్లూరు(క్రైమ్‌) : వినాయక చవితి ఉత్సవాలను ప్రజాజీవనానికి భంగం కలిగించకుండా  శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఏఎస్పీ బి.శరత్‌బాబు సూచించారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో ఆదివారం నగరంలోని వినాయక ఉత్సవ కమిటీసభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. విగ్రహాలు ట్రాఫిక్‌కు ఇబ్బందిలేకండా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. విగ్రహాలకు సంబంధించిన ఎత్తు, నిమర్జనం తేదీ, నిమర్జనం రూటు, ఉత్సవ కమిటీల పేర్లు పోలీసులకు ఇవ్వాలన్నారు. వినాయక మండపాల వద్ద కనీసం ఇద్దరు వలంటీర్లును ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గMýంండా చూడాలన్నారు. ఆకతాయిల వేధింపులు, గొలుసు దొంగతనాలు జరగకుండా ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయబద్ధమైన నృత్యాలు, మ్యూజికల్‌ నైట్‌ను నిర్వహించుకోవచ్చని, అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తర్వాత అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలన్నారు. ఉత్సవ నిమర్జనం రోజు ఉరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చొద్దని, మద్యం సేవించరాదని సూచించారు. మహిళలను, యువతులు, చిన్నారులను నిమర్జనం జరిగే ప్రదేశానికి తీసుకురాకూడదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని ప్రధాన మండపాల వద్ద పోలీసుశాఖ తరుపున నోడల్‌ ఆఫీసర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ జి.వెంటకరాముడు మాట్లాడుతూ విగ్రహాలు, మండపాల వద్ద విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, అగ్నిప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పోలీసులకు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ ఎన్‌.కోటారెడ్డి, రెండు, మూడు, నాలుగు, ఐదోనగర ఇన్‌స్పెక్టర్లు వి.సుధాకర్‌రెడ్డి, జి.రామారావు, సీహెచ్‌ సీతారామయ్య, జి.మంగారావు, ఎస్సైలు గిరిబాబు, అలీసాహెబ్, రఘునాథ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement