విద్యుదాఘాతానికి విద్యార్థి బలి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి విద్యార్థి బలి

Published Sun, Sep 4 2016 11:08 PM

student dies of vidyut shock

కలిపి (రొద్దం) : మండలంలోని కలిపి గ్రామంలో ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి బలయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. కలిపికి చెందిన సునందమ్మ కుమారుడు నరేష్‌ (14) పెద్దమంతూరు జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంటివద్ద కొళాయికి తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆదివారం పైప్‌లైన్‌కు సింగిల్‌ ఫేజ్‌ మోటర్‌ ఏర్పాటుచేసి నీళ్లు పట్టబోయాడు. ఉన్నపళంగా మోటర్‌కు విద్యుత్‌ ప్రసరించడంతో నరేష్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మతి చెందాడు.

పదేళ్ల కిందటే భర్త రంగనాథప్ప మతి చెందడంతో సునందమ్మ కూలిపనులు చేసుకుంటూ తన కుమారుడిని చదివించుకుంటోంది. ఇప్పుడు ఆ ఒక్కగానొక్క కొడుకు కూడా హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేకపోయింది. ఎస్‌ఐ మునీర్‌హమ్మద్, విద్యుత్‌శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు నారాయణస్వామి, నరసింహులు, మదన్‌మోహన్, బుజ్జప్ప తదితరులు విద్యార్థి తల్లిని పరామర్శించి దహన సంస్కారాలకు రూ .1000 నగదు అందజేశారు.

Advertisement
Advertisement