అన్నం పెట్టలేదని విద్యార్థుల ఆందోళన | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టలేదని విద్యార్థుల ఆందోళన

Published Sat, Sep 24 2016 9:07 PM

ఉన్నతపాఠశాల ముందు ఆందోళణ చేస్తున్న విద్యార్ధులు

సీతానగరం: వంటలు వండక విద్యార్ధులు పస్థులున్నారు. ఒకరోజుకాదు రెండు రోజులుకాదు నిరంతరం ఇదేపరిస్థతి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 25 మంది విద్యార్ధులు ఆకలిని తట్టుకోలేక ఆందోళ ణకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని  బూర్జ ఉన్నత పాఠశాలలో 408 మంది విద్యార్ధు లు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్ధులందరికీ మధ్యాహ్న భోజన పధకం అమలు చెయ్యాల్సిఉంది. ఈ నేపద్యం లో శనివారం ఉదయం పాఠశాలకు 354  విద్యార్ధులు హాజర య్యారు. అందులో 287 మందికి మద్యాహ్న భోజనం పెట్టడానికి 40 కేజీల బియ్యం నిర్వాహకులకు ఇచ్చారు. ఇచ్చిన బియ్యం వంటచెయ్యడంలేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. అలాగే హెచ్‌ఎం బియ్యం సక్రమంగా ఇవ్వక పోవడంతో అన్నం పెట్టక పోవడంతో ఆకలితో అలమటిస్తు ఆందోళణకు దిగారు. మద్యాహ్నం 1 గంటలకు అన్నం పెట్టే సమయంలో వంటగదికి వెళ్ళిన విద్యార్ధులు అన్నంలేదని చెప్పడంతో ఆకలితో ఉన్న 25 మంది విద్యార్ధులు  స్కూలు ఎస్‌ఎంసీ చైర్మెన్‌ కె సూర్యనారాయణ ఇంటికి వెళ్ళి పిర్యాదు చేసారు. హెచ్‌ఎంకు, భోజనపధకం నిర్వాహకులకు పలుమార్లు చెప్పినా ఫలితంలేదని అనడంతో మీడియాకు తెలియ జెయ్యాలని విద్యార్ధులకు చెప్పడంతో విద్యార్ధుల అకలి వెలుగులోకి వచ్చింది. నెలలతరబడి ఇబ్బందులు పాల్జేస్తున్న హెచ్‌ఎం ఎం క్రిష్ణమూర్తిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆకలితో ఉన్న విద్యార్ధులు  తాహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ఎంసీ కమిటీ చైర్మెన్‌ సూర్యనారాయణ ఇంటిముందు దర్నా చేయగా, ఉన్నతపాఠశాల హెచ్‌ఎం కార్యాలయం వద్ద  వందలాదిమంది విద్యార్ధులు సంఘీభావం తెలియజేస్తూ దర్నా చేసారు. 
 
విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలని కోరా- కె సూర్యనారయణ,ఎస్‌ఎంసీ చైర్మెన్‌ బూర్జ
నేను గత శుక్రవారం విద్యార్ధులకు మాడిపోయిన అన్నం పెట్టారని పిర్యాదు చేసినపుడు భవిష్యత్‌లో సమస్యరాకూడదని చెప్పాను. అయినా హెచ్‌ఎం క్రిష్ణమూర్తి, మధ్యాహ్న భోజననిర్వాహకులు పట్టించు కోలేదు.ఉన్నతాధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలి 
 
విద్యార్ధులకు 150 గ్రాముల బియ్యం సరిపోవు -ఎం క్రిష్ణమూర్తి ,హెచ్‌ఎం, బూర్జ
ప్రభుత్వం విద్యార్ధులకు మద్యాహ్నభోజన పధకం అమలుకు ఇస్తున్న 150 గ్రాముల బియ్యం చాలడంలేదు.  శనివారం హాజరైన 354 విద్యార్ధులకు గాను 287 మందికి భోజనాలకు బియ్యం ఇచ్చాను. దీంతో అన్నంచాలక గొడవ చేసారు.  
 

Advertisement
Advertisement