నైపుణ్యం పెంపొందించుకోవాలి | Sakshi
Sakshi News home page

నైపుణ్యం పెంపొందించుకోవాలి

Published Sun, Sep 11 2016 7:22 PM

నైపుణ్యం పెంపొందించుకోవాలి

  • ట్రిపుల్‌ ఐటీ ఉపకులపతి సత్యనారాయణ
  • విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ
  • బాసర : ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి ఎంఎస్‌ఎన్‌ రెడ్డి అన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘యూనివర్సిటీ లెవెల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ శిక్షణ కార్యక్రమాన్ని ట్రిపుల్‌ఐటీ ఉపకులపతి ఎస్‌.సత్యనారాయణ సూచన మేరకు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా హాజరై విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్‌ పుట్టుక, పనితీరు, విద్యా సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌లను ఏ విధంగా నిర్వహించాలో వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నైపుణ్యాన్ని సాధించే విధానాన్ని తెలిపారు.
    భాషా, వత్తి, జీవన విధానం, సాంకేతిక పరమైన నైపుణ్యాలు, మెళకువలు పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డి.శ్యాంబాబు మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు నైపుణ్య అభివద్ధిపై మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని  తెలిపారు.
    వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిచే సందేశాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్, అనిత, నరేష్, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement