సెలవు అడిగినందుకు విద్యార్థులపై దాడి | Sakshi
Sakshi News home page

సెలవు అడిగినందుకు విద్యార్థులపై దాడి

Published Sun, Jul 24 2016 8:54 AM

కాలేజీలో ధ్వంసమైన అద్దాలు - Sakshi

► విద్యార్ధులపై సిబ్బంది దాడి
►  నిరసనగా విద్యార్ధి సంఘాల ఆందోళన..
►  ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం.

చైతన్యపురి: గడ్డిఅన్నారం డివిజన్‌ వీవీనగర్‌ పాణనీయ క్యాంపస్‌లోని  శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ కళాశాలలో శుక్రవారం హోమ్‌ సిక్‌ సెలవులు ఇవ్వాలని అడిగినందుకు విద్యార్థులపై సిబ్బంది దాడి చేశారు. దీంతో విద్యార్ధి సంఘాల నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగటంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లో వెళితే శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్ధులకు హోమ్‌సిక్‌ సెలవులు ఇచ్చినందున తమకు కూడా సెలవులు ఇవ్వాలని ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు శుక్రవారం  కళాశాల ప్రిన్సిపాల్, ఇంచార్జిలను కోరారు.

అయితే వారు అందుకు అంగీకరించకపోవడంతో విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కళాశాల సిబ్బంది జోక్యం చేసుకుని గొడవకు దిగిన 18మంది విద్యార్ధులను చితకబాదారు. దీనిపై సమాచారం అం దడంతో ఏబీవీపీ నేతలు శ్రవణ్‌ ఆద్వర్యంలో శనివారం ఉదయం  కళాశాలకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సందర్భం గా కాలేజీలో అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వం సం చేశారు. సరూర్‌నగర్‌ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి నేతలను  అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ, గిరిజన సంఘాలు యాజ మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్ధులపై దాడి చేసిన సిబ్బం దిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశా రు. కాగా కాలేజీకి సెలవులు ప్రకటించటంతో  విద్యార్ధులు ఇళ్లకు వెళ్లారు.  

కేసులు నమోదు...
విద్యార్ధుల తల్లిదండ్రుల  ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది వేణుగౌడ్, యాకూబ్, నానిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ లింగయ్య తెలిపారు. కళాశాల ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన విద్యార్ధి నేతలు శ్రవణ్, అయ్యప్ప, మహేష్‌ మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు
సెలవులు ఇవ్వమని అడిగినందుకు విద్యార్ధులపై శ్రీచైతన్య సిబ్బంది దాడి చేసిన విషయం తెలసుకున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు అచ్యుతరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఇందుకు బాధ్యులైన పీఆర్‌ఓ వేణు, జూనియర్‌ లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆయనకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచార ణ జరిపి ఆగస్టు 10లోగా నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి, ఎల్‌బీనగర్‌ డీసీపీని ఆదేశించినట్లు అచ్యుతరావు తెలిపారు.
 

Advertisement
Advertisement