పుష్కరాలను విజయవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

పుష్కరాలను విజయవంతం చేయాలి

Published Thu, Aug 11 2016 1:32 AM

success to the puskharaghat

గద్వాల న్యూటౌన్‌ : అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీపీ సుభాన్‌ అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని నదిఅగ్రహారం, తెలుగోనిపల్లి, బీరెల్లి‡ఘాట్లను సందర్శించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ కృష్ణాపుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారని, ఆయా గ్రామాల ప్రజలు వారిని ఆదరించాలని కోరారు. ప్రతిఒక్కరూ సేవాభావంతో పనిచేస్తూ పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలన్నారు. 
 

Advertisement
Advertisement