Sakshi News home page

బడిబయటి పిల్లలపై సర్వే చేయండి

Published Wed, Sep 14 2016 12:02 AM

surey on childlabour

మక్తల్‌ : బడిబయట ఉన్న చిన్నపిల్లల సమాచారం సేకరించి ఇవ్వాలని డీఈఓ విజయలక్ష్మీబాయి సూచించారు. మంగళవారం మక్తల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెచ్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మక్తల్‌ మండలంలో 46మంది మాత్రమే పిల్లలు బడిబయట ఉన్నారనడం సరికాదన్నారు.
 
ఆయా గ్రామాల్లో నాలుగురోజుల్లో ప్రతి ఇంటికి వెళ్లి తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఐజ, మక్తల్‌ మండలాల్లోనే ఆడపిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. ఐసీడీఎస్‌ పీడీ జ్యోత్స్న మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల వద్ద చిన్నారుల సమచారం తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు గోవిందరాజులు, సుబ్రమణ్యం; సీడీపీఓ విజయలక్ష్మి, తహసీల్దార్‌ ఓంప్రకాష్, ఎంఈఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement