ఇసుకపై నిఘా | Sakshi
Sakshi News home page

ఇసుకపై నిఘా

Published Sat, Jul 30 2016 12:04 AM

ఇసుకపై నిఘా

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ప్రభుత్వ ఇసుక క్వారీల నిర్వహణ తీరుపై ఫిర్యాదులు, ఆరోపణలు ఎక్కువ కావడంతో విజిలెన్స్‌ విభాగం విచారణ మొదలుపెట్టింది. క్వారీల నిర్వహణ తీరును పూర్తిగా పరిశీలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై పలు క్వారీలకు అనుమతి ఇచ్చింది.
 
జిల్లాలో ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని ఇసుక క్వారీల్లో నిర్వహణ లోపాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది తీరుతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతోందని ఆదివాసీ సంఘాల నాయకులు విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదు చేశారు. గిరిజనులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన క్వారీలు.. నిర్వహణ లోపాలతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నెరవేడం లేదని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్‌ విభాగం క్వారీల నిర్వహణపై విచారణ మొదలుపెట్టింది.
 
ఏటూరునాగారం ఇసుక క్వారీలో 2015 మార్చి 11 నుంచి 2016 ఏప్రిల్‌ 1 వరకు  13,62,050 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక విక్రయాలు జరిగాయి. గనుల శాఖకు రూ.5.40 కోట్ల ఆదాయం సమకూరింది. తుపాకులగూడెం క్వారీకి సంబంధించి 1,37,500 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను విక్రయించగా, రూ.5.50 లక్షల ఆదాయం సమకూరింది. ఈ క్వారీల్లో విక్రయించే ఇసుకతో ఆయా గ్రామాల్లోని గిరిజన సొసైటీల సభ్యులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక విక్రయాలతో పోల్చితే సొసైటీ సభ్యులకు ఇచ్చిన మొత్తం తక్కువగా ఉందని విజిలెన్స్‌ శాఖకు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఈ విషయంపై విజిలెన్స్‌ విభాగం దృష్టి సారించింది. క్వారీల వారీగా విక్రయాలు, వసూలైన డబ్బులు, సొసైటీ సభ్యులకు చెల్లింపు లెక్కలను పరిశీలించేందుకు సన్నద్ధమైంది. 
 
ఆడిట్‌కు ఆదేశాలు...
విజిలెన్స్‌ విభాగం విచారణకు ఉపక్రమించగా... క్వారీల వారీగా అమ్మకాలు, వచ్చిన ఆదాయం, సొసైటీ సభ్యులకు ఇచ్చిన మొత్తం వంటి లెక్కలపై ఆడిట్‌ నిర్వహించాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) విచారణకు ఆదేశించింది. ఇసుక విక్రయాలకు, సొసైటీ సభ్యులు ఇచ్చిన మొత్తాలకు తేడా ఉందనే ఫిర్యాదుల నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై ఆడిట్‌ నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అమయ్‌కుమార్‌ ఆదేశాలు  జారీ చేసినట్లు తెలిసింది. – మిగతా 7లోu 

Advertisement

తప్పక చదవండి

Advertisement