మాస్టర్‌ స్విమ్మర్ల ఎంపిక పూర్తి | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ స్విమ్మర్ల ఎంపిక పూర్తి

Published Sun, Sep 11 2016 11:15 PM

ఎంపికైన క్రీడాకారులతో జిల్లా స్విమ్మింగ్‌ సంఘం ప్రతినిధులు, డీఎస్‌ఏ కోచ్‌ అప్పలనాయుడు

శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా మాస్టర్‌ స్విమ్మర్ల ఎంపిక ప్రక్రియ పూరై్తంది. శ్రీకాకుళం జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్ధానిక శాంతినగర్‌ కాలనీలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఆదివారం మాస్టర్‌ స్విమ్మింగ్‌ క్రీడాకారుల ఎంపికలను నిర్వహించారు. ఉత్సాహభరితంగా సాగిన ఎంపికల్లో జిల్లా నలుమూలల నుంచి ఔత్సాహిక స్విమ్మర్లు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబర్చిన వారిని, గత ట్రాక్‌ రికార్డును పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను ఖరారు చేశారు.  
 
14 మందితో తుది జాబితా ఖరారు..
ఇదిలా ఉండగా 14 మందితో కూడిన జిల్లా మాస్టర్స్‌ స్విమ్మర్ల తుది జాబితాను జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కాంతారావు, డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ కోచ్‌ పి.అప్పలనాయుడు సంయుక్తంగా వెల్లడించారు. వీరంతా ఈ నెల 18వ తేదీన విజయవాడ కేంద్రంగా గాంధీనగర్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో జరగనున్న 2వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఎంపికల కార్యక్రమంలో జిల్లా స్విమ్మింగ్‌ సంఘం కోశాధికారి ఎం.విష్ణుమూర్తి, కార్యవర్గ సభ్యులు పి.వరప్రసాద్, సీనియర్‌ స్విమ్మర్లు పాల్గొన్నారు. 
 
ఎంపికైన క్రీడాకారులు వీరే...
– 25–29 ఏళ్ల విభాగంలో జి.శివ (బాలేరు), వి.రాజశేఖర్, ఎన్‌.సూర్యతేజ (శ్రీకాకుళం), పి.క్రిష్ణారావు (మామిడివలస).
– 30–34 ఏళ్ల విభాగంలో పి.గోవిందరావు (సింగుపురం).
– 35–39 ఏళ్ల విభాగంలో వై.మనోజ్‌కుమార్, జి.మధుబాబు, టి.పాపారావు (శ్రీకాకుళం), జీ.ఎం.బాబు (పాతపట్నం), పి.అప్పలనాయుడు (డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ కోచ్‌). 
– 40–44 ఏళ్ల విభాగంలో జి.శ్రీరామ్మూర్తి (పాతపట్నం), ఎస్‌.కాంతారావు (ఏఆర్‌ కానిస్టేబుల్, ఎచ్చెర్ల).
– 50–54 ఏళ్ల విభాగంలో ఎ.షాజహాన్‌ (శ్రీకాకుళం), ఎస్‌.రాధాక్రిష్ణ (శ్రీకాకుళం). 
 

Advertisement
Advertisement