ఉత్సాహంగా స్విమ్మింగ్‌ క్రీడాకారుల ఎంపిక | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా స్విమ్మింగ్‌ క్రీడాకారుల ఎంపిక

Published Wed, Aug 3 2016 11:27 PM

స్విమ్మింగ్‌ ఎంపికలు నిర్వహిస్తున్న దృశ్యం

♦ ఈ నెల 7న విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు
 
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా సీనియర్‌ (పురుషులు, మహిళలు) స్విమ్మింగ్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. శ్రీకాకుళం జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ పరిధి శాంతినగర్‌కాలనీలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో బుధవారం జరిగిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 30 మంది స్విమ్మర్లు హాజరయ్యారు. ఫ్రీసై్టల్, బటర్‌ఫ్లై, బ్రెస్ట్‌ స్ట్రోక్, బ్యాక్‌స్ట్రోక్‌ తదితర విభాగాల్లో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. క్రీడాకారుల ప్రతిభ, గత గణాంకాలను పరిగణనలోకి తీసుకుని క్రీడాకారులను ఎంపికచేశారు. ఎంపికైన తొమ్మిది మంది క్రీడాకారుల తుది జాబితాను శ్రీకాకుళం జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఎన్‌ఎస్‌వీ ప్రసాద్‌ వెల్లడించారు. స్విమ్మింగ్‌ కోచ్‌ పి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. స్విమ్మింగ్‌ సంఘ ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు హాజరయ్యారు. 
 
ఎంపికైన క్రీడాకారులు వీరే..
 
ఎస్‌.దివ్యతేజ (50, 100, 200 మీటర్ల ఫ్రీసై్టల్, 100, 200 మీటర్ల బటర్‌ఫ్లై), ఎం.ప్రకాష్‌ (
50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌), కె.యోగేంద్ర (50, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 200 మీటర్ల ఫ్రీసై్టల్‌), ఎం.నిఖిల్‌ప్రసాద్‌ (50, 100 మీటర్ల ఫ్రీసై్టల్‌), 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌), డి.మురళి (100, 200 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్, 800 మీటర్ల ఫ్రీసై్టల్‌), జె.సాయిసతీష్‌ (400, 800 మీటర్ల ఫ్రీసై్టల్‌), డి.యోగానంద్‌ (100, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 400 మీటర్ల ఫ్రీ సై్టల్‌), పి.రమణ (400 మీటర్ల  ఫ్రీసై్టల్‌), డి.రాజేష్‌ (50 మీటర్ల బటర్‌ఫ్లై) విభాగాల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. 
 
7న రాష్ట్రస్థాయి పోటీలు
 
విజయవాడ కేంద్రంగా గాంధీనగర్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఈ నెల 7న రాష్ట్రస్థాయి సీనియర్స్‌ (పురుషులు, మహిళలు) స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయని ప్రసాద్‌ వెల్లడించారు. ఇక్కడ ఎంపిచేసిన క్రీడాకారులంతా రాష్ట్రపోటీలకు అర్హత సాధించారని పేర్కొన్నారు.  
 
 

Advertisement
Advertisement