వ్యాధుల పంజా! | Sakshi
Sakshi News home page

వ్యాధుల పంజా!

Published Fri, Jul 22 2016 12:56 AM

వ్యాధుల పంజా! - Sakshi

 శ్రీకాకుళం సిటీ : జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలు వ్యాధులతో వణికిపోతున్నాయి. అతిసార దాడి చేయగా, మలేరియూ, డెంగ్యూ, టైపాయిడ్ జ్వరాలు జనంతో ఆటలాడుకుంటున్నాయి. ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నా నయం కావడం లేదని రోగపీడితులు వాపోతున్నారు. సర్కార్ వైద్యం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
 
 వణికిస్తున్న డెంగ్యూ
 డెంగ్యూ జ్వరాలతో జనం వణికిపోతున్నారు. సారవకోట మండలం నౌతళ గ్రామానికి చెందిన పల్లి మనోజ్‌కుమార్(5) డెంగ్యూ వ్యాధి లక్షణాలున్నట్లు బంధువులు తెలిపారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వ్యాధి  ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తతం అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు.

 - పలాస మండలం మామిడిపల్లి గ్రామంలో ఇదే వ్యాధి లక్షణాలతో వంకల మున్నా(6) ఈనెల 9వ తేదీన మృతి చెందాడు. కాశీబుగ్గ భాష్యం స్కూల్‌లో యూకేజీ చదువుతున్న అతనికి కాశీబుగ్గలోని పలు ఆస్పత్రుల్లో వైద్య సేవలందించినా ఫలితం లేకపోయింది. - సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు గ్రామానికి చెందిన బయ్యా జానకి(17) డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మృతి చెందింది.
 
 భయపెడతున్న డయేరియా
 డయేరియూ మహమ్మారి కూడా జనాన్ని వెంటాడుతోంది. ఎల్.ఎన్.పేట మండలంలో ఇటీవలే డయేరియా వ్యాధితో పెద్దకోట గ్రామంలో ఒకే కుటుంబంలో తల్లీ, కూతుర్లు వ్యాధితో మరణించారు. ఈనెల 15వ తేదీన గేన లచ్చెమ్మ (48), 17వ తేదీన బంసుగంట రమణమ్మ (27) ప్రాణాలు కోల్పోయూరు.
 
 -సారవకోట మండలం గొర్రిబంద గ్రామానికి చెందిన లక్ష్మీ కుమారి(16) అతిసారతో బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళంలో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.  
 
 కానరాని కార్యాచరణ!
 సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయని వైద్యశాఖాధికారులకు తెలిసినప్పటికే వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ప్రణాళికలను మాత్రం సిద్ధం చేయలేదనే విమర్శలు వస్తున్నారుు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న తప్పు ఒప్పులను సరిదిద్దుకునేందుకు ముందస్తుగా వైద్యులను, సిబ్బందిని, వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కార్యకర్తలను సిద్ధం చేసుకోవాల్సి ఉన్నా ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఆస్పత్రుల్లో  మందులు అందుబాటులో  ఉన్నాయో లేవో పరిశీలించి ముందుగానే ఇండెంట్ మేరకు సిద్ధం చేసుకోవాల్సి ఉన్నా ఆ పరిస్థితి ఎక్కడా లేదు.
 

Advertisement
Advertisement