ఆట, పాటలకే ప్రాధాన్యం | Sakshi
Sakshi News home page

ఆట, పాటలకే ప్రాధాన్యం

Published Thu, Apr 14 2016 2:18 AM

ఆట, పాటలకే ప్రాధాన్యం - Sakshi

ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే చాలు. ఎంతో సంతోషంగా ఉండేది. సెలవుల్లో అమ్మా నాన్నలతో కలిసి దేశంలోని పర్యాటక ప్రాంతాలు తిరిగేవాళ్లం. 5 నుంచి పదో తరగతి చదివే వరకు భరతనాట్యం, వీణ, కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. వీడియో గేమ్స్‌తో ఎంజాయ్ చేశా. కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ల దగ్గరికి వెళ్లి అక్కడ వ్యవసాయ పొలాలు చూశా. నేను తొమ్మిదో తరగతి పూర్తికాగానే ఉత్సాహంతో సెలవుల్లోనే పదో తరగతి పుస్తకాలు చదివా. వేసవి సెలవులను ఎంతో సంతోషంగా గడిపాను.
- తాండూరు ఏఎస్పీ చందనదీప్తి...

ఈ ఫొటోలో భరతనాట్యం చేస్తున్న బాలికను గుర్తుపట్టారా? అదేనండీ.. తాండూరు ఏఎస్పీ చందనదీప్తి. వేసవి సెలవుల్లో తన చిన్ననాటి అనుభవాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకుంది. వేసవి సెలవులు వచ్చాయంటే పర్యాటక స్థలాలను సందర్శించడంతో పాటు భరతనాట్యం, వీణ, కర్ణాటక సంగీతం నేర్చుకునే దానిని. వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేశా. కొన్ని రోజులు అమ్మమ్మ  ఇంటికి వెళ్లి, అక్కడ వ్యవసాయ పొలాలను చూడడం, అక్కడే ఆడుకునేందుకు ఇష్టపడేదాన్ని. అమ్మమ్మ రోజూ రామాయణం, భారతం గురించి చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేదాన్ని. నాన్న గనుల శాఖలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం రీత్యా తను చిత్తూరు, నల్గొండ తదితర జిల్లాలో పనిచేశారు. దీంతో అక్కడే నా బాల్యం కొనసాగింది. అక్కడి స్నేహితులతో కలిసి వేసవి సెలవుల్లో షటిల్, క్రికెట్ ఆడా. ఇంకా తెలుగు, ఇంగ్లిష్‌లో పద్యాలు కూడా రాశా. బాల్యం ఓ తీపి గుర్తు. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఆడుకోవడం ఓ మరిచిపోలేని అనుభూతి.

Advertisement
Advertisement