‘బాబు’పాలనలో దగాపడ్డ నిరుద్యోగులు | Sakshi
Sakshi News home page

‘బాబు’పాలనలో దగాపడ్డ నిరుద్యోగులు

Published Mon, Jan 9 2017 11:36 PM

‘బాబు’పాలనలో దగాపడ్డ నిరుద్యోగులు - Sakshi

  • ఉద్యోగమూ లేదు–నిరుద్యోగ భృతీ లేదు
  • ఉద్యోగపోరులో మండిపడ్డ కన్నబాబు, అనంతబాబు
  • కలెక్టరేట్‌ వద్ద హోరెత్తిన నినాదాలు
  • కాకినాడ :
    బాబు వస్తే జాబు వస్తుందన్న ప్రచారాన్ని నమ్మి అధికారాన్ని కట్టబెడితే ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారాన్ని చేపట్టాక ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి ఇవ్వక ఎంతో మంది విద్యావంతులైన యువత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంతబాబు అధ్యక్షతన కలెక్టరేట్‌ వద్ద సోమవారం జరిగిన ‘ఉద్యోగపోరు’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కన్నబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మహిళలు, రైతులు, నిరుద్యోగులు సహా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కేసులకు తూటాలకయూత్‌ నాయకులు, కార్యకర్తలు భయపడి వెన్ను చూపరని, జగ¯ŒS సైనికులుగా రొమ్ము విరిచి పోరాడతామన్నారు. మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యులు పినపే విశ్వరూప్‌ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ మోసపూరిత విధానాలపై యువత సంఘటితమైన పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలను నిలువునా ముంచేసి తాను మాత్రం ఉద్యోగం చేసుకుంటున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు మాట్లాడుతూ టీడీపీ సర్కార్‌కు గుణపాఠం చెప్పేలా నిరుద్యోగులంతా ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్‌ సలామ్‌బాబు మాట్లాడుతూ బాబు విధానాలు మారకపోతే తెలుగుదేశానికి భవిష్యత్తులో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసే సత్తా యువతకు ఉందన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ చంద్రబాబు అధికారాన్ని చేపట్టాక పేదల ఆశలు అడియాశలయ్యాయన్నారు. కాకినాడ, మండపేట, ముమ్మిడివరం కో–ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్, వేగుళ్ళ లాలాకృష్ణ, పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఉన్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను కూడా కాసుల కోసం అమ్ముకుంటున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులపై ధ్వజమెత్తారు. ప్రత్తిపాడు, రాజమండ్రిరూరల్, జగ్గంపేట, పి.గన్నవరం కో–ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, గిరిజాల బాబు, ముత్యాల సతీష్, కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ యువత కన్నెర్రజేస్తే చంద్రబాబు సర్కార్‌ శంకరగిరి మాన్యాలు పట్టడం తధ్యమంటూ ఉద్యోగ పోరులో భాగంగా పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ‘బాబు’కు అధికారం ఇవ్వడం ద్వారా కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారిందన్నారు. వైఎస్సార్‌సీపీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్‌ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక భర్తీచేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహ¯ŒS మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఉద్యోగపోరు అద్దంపడుతోందని, ఇక ప్రభుత్వం ఆటలు సాగవని హెచ్చరించారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల యూత్‌ అధ్యక్షులు లాలం రాంబాబు, నరసింహరాజు మాట్లాడుతూ యువశకిని నిర్వీర్యం చేస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. యువజన విభాగం రాష్ట్ర నాయకులు మత్సా లోకేష్, హరీష్, గనిశెట్టి రమణ్‌లాల్‌ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు గద్దెదిగితేనే సాధ్యమన్న పరిస్థితి నెలకొందన్నారు. కాకినాడ, అమలాపురం, పిఠాపురం యువజన విభాగాల అధ్యక్షులు ఎ¯ŒSజీకే కిశోర్, నల్లా శివాజీ, శ్రీనివాస్‌ మాట్లాడుతూ కల్లబొల్లి కబుర్లతో యువతను నిర్వీర్యం చేస్తున్న టీడీపీ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయన్నారు.
    మండపేట కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, జడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శులు లింగం రవి, సంగిశెట్టి అశోక్, బొబ్బిలి గోవిందు, రాష్ట్ర ప్రచారసెల్‌ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్రసేవాదళ్‌ కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా మైనార్టీ, డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధులు ఆదిత్యకుమార్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర యూత్‌ కార్యదర్శులు ఎ¯ŒSడిఆర్, కత్తిపూడి శ్రీను, గుర్రం గౌతమ్, పోలు కిరణ్‌మోహ¯ŒSరెడ్డి, జక్కంపూడి వాసు, సత్యనారాయణ చౌదరి, పెయ్యల చిట్టిబాబు, పాలెపు ధర్మారావు, అల్లి రాజబాబు, కార్తీక్, వాసిరెడ్డి జమీల్,  కార్పొరేటర్‌లు,యూత్‌ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు.
     
    ‘ఉద్యోగ పోరు’కు అనూహ్యస్పందన 
    స్ఫూర్తినిచ్చిన నేతల ప్రసంగం
    చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగులను నిలువునా దగాచేసిన వైనాన్ని ‘ఉద్యోగ పోరు’ ఎలుగెత్తి చాటింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన పోరు విజయవంతమైంది. నమ్మి మోసంచేసిన చంద్రబాబు సర్కార్‌పై పోరాటం చేసే వారిని కేసులతో వేధింపులకు గురిచేస్తున్నా రొమ్ము విరిచి ఎదురొడ్డి పోరాడతామన్న పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి, ఉద్యోగులకు భరోసా ఇస్తూనే కేసులకు వెరవద్దన్న అనంతబాబుల ఉద్వేగపూరిత ప్రసంగాలు యువతకు మనో ధైర్యాన్నిచ్చాయి.  మోసపోయిన నిరుద్యోగులు, యువతకు అండగా నిలిచేందుకు జిల్లా నుంచి శ్రీకారం చుట్టిన తొలి కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. పార్టీలకు అతీతంగా అటు కోనసీమ, ఇటు మెట్ట ప్రాంతమే కాకుండా రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన యువ స్పందనతో కాకినాడ కలెక్టరేట్‌ కిటకిటలాడింది.  కొత్త ఉద్యోగాలు మాటేమో కాని ఉన్న ఉద్యోగాలకే కోత పెడుతున్నారంటూ కొందరు నిరుద్యోగులు తమ ఆవేదనను ఉద్యోగపోరులో నేతలతో పంచుకున్నారు. కనీసం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలైనా తెచ్చుకుందామని వెళుతుంటే రూ.15వేలు నుంచి పాతిక వేలు కమీష¯ŒSలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నేతల దృష్టికి వచ్చాయి. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని తూర్పు సెంటిమెంట్‌తో ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం, అందుకు యువత నుంచి స్పందన రావడంతో పార్టీ క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపింది.
     

Advertisement
Advertisement