ముద్రగడతో మంతనాలు: స్పష్టమైన హామీ వస్తేనే..! | Sakshi
Sakshi News home page

ముద్రగడతో మంతనాలు: స్పష్టమైన హామీ వస్తేనే..!

Published Thu, Feb 4 2016 9:36 PM

ముద్రగడతో మంతనాలు: స్పష్టమైన హామీ వస్తేనే..! - Sakshi

కిర్లంపూడి: కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్షకు సిద్దమవుతున్న సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు  గురువారం రాత్రి భేటీ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఈ సమావేశం జరిగింది. శుక్రవారం నుంచి నిరాహార దీక్ష చేపడుతున్న ముద్రగడను ఒప్పించి.. నిరశనను ఉపసంహరింపజేసే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

కాపు రిజర్వేషన్ల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన మేరకు టీడీపీ నేతలు ముద్రగడను కలిసినట్టు సమాచారం. అయితే కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని వస్తే తప్ప తాను నిరాహార దీక్ష ఆలోచనను ఉపసంహరించుకోనని, శుక్రవారం యథాతథంగా దీక్ష కొనసాగుతుందని ముద్రగడ ఈ సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఈ విషయమై ముద్రగడతో టీడీపీ నేతల చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement
Advertisement