చిన్నారికి లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

చిన్నారికి లైంగిక వేధింపులు

Published Tue, Feb 23 2016 2:56 AM

చిన్నారికి లైంగిక వేధింపులు - Sakshi

పీఈటీ ఉపాధ్యాయుని వెకిలి చేష్టలు
వికాస్ పబ్లిక్ స్కూల్‌లో ఘటన
భగ్గుమన్న విద్యార్థుల తల్లిదండ్రులు
రెండు బస్సులకు నిప్పు

 ఏడేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ టీచర్ ఉదంతం జిల్లాలో కలకలం సృష్టించింది. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులంతా ఏకమై ఆందోళనకు దిగారు. టీచర్ అకృత్యంపై కన్నెర్ర చేశారు. రెండు స్కూల్ బస్సులకు నిప్పంటించారు. మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలోని వికాస్ పబ్లిక్ స్కూల్‌లో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

భగ్గుమన్న అక్బర్‌పేట
మిరుదొడ్డి: వికాస్ పబ్లిక్ స్కూల్‌లో సోమవారం ఓపీఈటీ టీచర్ 1వ తరగతి విద్యార్థినిని కొద్దిరోజులుగా లైంగికంగా వేధిస్తున్నట్టు వెలుగుచూసిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. దుబ్బాక మండలం చిట్టాపూర్‌కి చెందిన బాలిక (7) ఈ స్కూల్‌లో 1వ తరగతి చదువుతోంది. ఈ బాలిక గ్రామానికే చెం దిన ఈ స్కూల్ పీఈటీ కుమార్.. పదిహే ను రోజులుగా చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కొద్ది రోజులుగా స్కూ లుకు వెళ్లనని బాలిక అల్లరి చేస్తుండటం తో తల్లిదండ్రులు గట్టిగా అడిగారు. దీం తో టీచర్ తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును చెబుతూ చిన్నారి బోరుమంది. దీనిపై త ల్లిదండ్రులు స్కూలు యాజమాన్యం దృ ష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో ఆ నోటా ఈ నోటా విషయం పొక్కి.. ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీ సింది. స్కూల్‌లోని మిగతా విద్యార్థుల తల్లిదండ్రులంతా ఏకమై మూకుమ్మడిగా దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. రెం డు స్కూలు బస్సులను అగ్నికి ఆహుతి చే శారు. ఈ ఘటనలతో స్కూలులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యా రు. ఏం జరుగుతోందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం వి ద్యార్థుల తల్లిదండ్రులు భూంపల్లి చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకోకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

 బాధిత కుటుంబానికి ఎంపీ ఓదార్పు
దుబ్బాక:
బాలిక కుటుంబాన్ని మెదక్ ఎం పీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మ నో ధైర్యాన్నిచ్చారు. జిల్లా ఎస్పీ సుమతితో ఫోన్లో మాట్లాడి.. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

 ఉద్రిక్తతలు వద్దు: ఎస్పీ సుమతి
దుబ్బాక /మిరుదొడ్డి: ఉద్రిక్తతలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెల కొనేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జి ల్లా ఎస్పీ సుమతి కోరారు. సోమవారం ఆమె అక్బర్‌పేటలోని వికాస్ స్కూల్‌ను సందర్శించారు. ఉదంతం వివరాలను అ డిగి తెలుసుకున్నారు. సంఘటనపై ఎవ రూ ఆగ్రహావేశాలకు లోనుకావద్దని గ్రా మస్తులను కోరారు. ఆమె వెంట దుబ్బాక సీఐ రామకృష్ణారెడ్డి, భూంపల్లి ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

 కీచక గురువును శిక్షించాలి
సిద్దిపేట టౌన్: చిన్నారిని లైంగికంగా వేధించిన పీఈటీని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు మన్నెకుమార్ సోమవారం ఒక ప్రకటనలో డి మాండ్ చేశారు. అక్బర్‌పేట వికాస్ పాఠశాలలో చిన్నారిపై జరిగిన ఘటన హేయమైందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

 స్కూల్ గుర్తింపు రద్దుకు డిమాండ్
సంగారెడ్డి మున్సిపాలిటీ: చిన్నారిపై లైం గిక వేధింపులకు పాల్పడిన పీఈటీపై ని ర్భయ కేసు నమోదు చేయడంతో పాటు వికాస్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్, రవి అదనపు ఎస్పీ వెంకన్నకు వి నతిపత్రం అందజేశారు. ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.

బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల సాయం
దుబ్బాక: లైంగిక వేధింపులు, వికృత చేష్టలకు గురైన చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింది రూ. 2 లక్షలను విడుదల చేసిందని రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. సోమవారం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిందితున్ని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా, మంత్రి హరీష్‌రావు మంత్రి స్పందించారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement