త్రిబుల్‌ రైడింగ్‌...ఆపై వీరంగం | Sakshi
Sakshi News home page

త్రిబుల్‌ రైడింగ్‌...ఆపై వీరంగం

Published Fri, Sep 22 2017 6:48 AM

teenager anger on trafic police when stoped hes triple riding

                                        ట్రాఫిక్‌ ఎస్‌ఐ సతీష్‌తో వాదనకు దిగిన యువకుడు

అనంతపురం సెంట్రల్‌ : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ట్రాఫిక్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడో యువకుడు. ఈ ఘటన గురువారం టవర్‌క్లాక్‌ కూడలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ట్రాఫిక్‌ ఎస్‌ఐ సతీష్‌ సిబ్బందితో కలిసి గురువారం టవర్‌క్లాక్‌ వద్ద ట్రాఫిక్‌ విధుల్లో ఉన్నారు. ఓ యువకుడు త్రిబుల్‌ రైడింగ్‌తో వచ్చారు. వాహనం ఆపేందుకు యత్నిస్తుండగా వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. పైగా వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇచ్చినట్లు సంకేతాన్ని చూపుతూ వెళ్ళాడు.

దీంతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సదరు యువకున్ని ఎస్‌ఎస్‌ ప్యారడైజ్‌ హోటల్‌ వెళ్లే సమయానికి ఛేజ్‌చేసి పట్టుకున్నారు. యువకున్ని, ద్విచక్ర వాహనం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సదరు యువకుని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సదరు యువకున్ని వదిలేసినట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement