బంద్ ప్రారంభం.. బస్సులను అడ్డుకుంటున్న నేతలు | Sakshi
Sakshi News home page

బంద్ ప్రారంభం.. బస్సులను అడ్డుకుంటున్న నేతలు

Published Sat, Oct 10 2015 6:00 AM

బంద్ ప్రారంభం.. బస్సులను అడ్డుకుంటున్న నేతలు

హైదరాబాద్: రుణమాఫీ, రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన బంద్ ప్రారంభమైంది. ఆయా పార్టీల నేతలు వివిధ జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలకు దిగారు. హైదరాబాద్లో దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డీపో ముందు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. హయత్ నగర్ డీపో ఎదుట టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభించారు. మరోపక్క, రాజేంద్రనగర్ డిపో ముందు టీటీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాజీ మంత్రి సబిత బైఠాయించారు.

ఇక జిల్లాల్లో మెదక్ లో సిద్ధిపేట ఆర్టీ సీ డిపో ముందు పలువురు ప్రతిపక్ష నాయకులు బస్సులు నడవనీయకుండా అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించారు. నాగర్ కర్నూల్ డిపో ముందు కూడా భారీ సంఖ్యలో ప్రతిపక్ష సభ్యులు బైఠాయించారు. రాజధానితో పాటు జిల్లా కేంద్రాల్లో బస్సులు యథావిధిగా నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించిన నేపథ్యంలో బస్సులను అడ్డుకునేందుకు ఆయా డిపోల ముందుకు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు చేరుకుంటున్నారు. మరోపక్క పోలీసులు కూడా అదే స్థాయిల్లో బస్ డిపోల వద్దకు చేరుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement