2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా | Sakshi
Sakshi News home page

2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

Published Fri, Nov 11 2016 1:25 AM

2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా - Sakshi

‘సీమాంధ్ర హక్కుల చైతన్యసభ’లో పవన్ కల్యాణ్
అనంతపురంలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభిస్తా
ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీని వంచించారు
కేంద్ర ప్యాకేజీని చంద్రబాబు ఎలా స్వాగతించారు?
అవినీతిపై టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి

సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘సమకాలీన రాజకీయాలు, దోపిడీతో కొన్నివర్గాలు, ప్రాంతాలు, కులాలకు దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. ఇలాంటి రాజకీయాలు చూసి విసిగి వేసారిపోయాం. అందుకే అవినీతి లేని రాజకీయాల కోసం జనసేన రాజకీయ కార్యకలాపాలను అనంతపురం నుంచే ప్రారంభిస్తుంది. అనంతపురంలో పార్టీ మొదటి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తా, 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా!’’ అని జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ స్పష్టంచేశారు.

‘సీమాంధ్ర హక్కుల చైతన్యసభ’ పేరుతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ ప్రసగించారు. ఓట్ల కోసం అర్థమయ్యే భాషలో మాట్లాడిన నేతలు, ప్రత్యేకహోదా విషయంలో తికమకలు పెడతున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి రావల్సిందే ఇచ్చారు తప్ప కొత్తగా ఏమీ లేదని ఆక్షేపించారు. చట్టబద్ధతలేని ప్యాకేజీకి సన్మానాలు చేరుుంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదన్నారు.

పోల ‘వరమూ’ మోసమే!
పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలోనూ కేంద్రం వంచించిందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయప్రాజెక్టుగా గుర్తించి వందశాతం నిధులిస్తామని బిల్లులో చెప్పినా నికరంగా ఇచ్చేది రూ.8వేల కోట్లేనన్నారు. తప్పుడు మాటల తో వంచిస్తుంటే 2019 ఎన్నికల్లో ఏం చేయాలో మాకు బాగా తెలుసని హెచ్చరించారు. జేబులు నింపుకునేందుకే దుగరాజపట్నం పోర్టు నిర్మాణమని విమర్శించారు. జనసేన తొలి కార్యాలయం అనంతపురంలో ప్రారంభిస్తామని వెల్లడించారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టంచేశారు.

ప్యాకేజీని ఎలా స్వాగతించారో చెప్పాలి
ఎన్నోలోపాలున్న ప్యాకేజీని టీడీపీ ఎలా స్వాగతించిందో సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో మితిమీరిన అవినీతిపై టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిం చారు.కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించకపోతే మళ్లీ రాష్ట్రం ముక్కలవుతుందని హెచ్చరించారు. జనసేన పోరాటం విధానాలపైనే తప్ప వ్యక్తులపై కాదన్నారు. నరేంద్రమోదీపై తనకు అపారగౌరవం ఉందని, అలాగని రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నపుడు ఎదురెళ్లి మాట్లాడేందుకు వెనకాడనని తెలిపారు.

Advertisement
Advertisement