హోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు

27 Dec, 2016 21:27 IST|Sakshi
హోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు
 బాపట్ల: రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు మంగళవారం హోరాహోరీగా సాగాయి. ప్రకాశం జిల్లా బోయినవారిపాలెం, బాపట్ల మండలం వెదుళ్ళపల్లి కొత్తపాలెం జట్లు మధ్య పోటాపోటీగా జరిగిన మ్యాచ్‌లో బోయినవారిపాలెం టీము గెలుపొందింది. అదేవిధంగా బేతపూడి, వైఎస్సార్‌నగర్‌కు చెందిన టీములు తలపడగా వాటిలో బేతపూడి టీము గెలుపొందింది. ఫైనల్స్‌కు వెదుళ్ళపల్లి కొత్తపాలెం టీము, చిత్తూరు, రాజమండ్రి, హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ టీములు పోటీలో ఉన్నాయి. బుధవారం సెమీఫైనల్స్‌, ఫైనాల్స్‌ మ్యాచ్‌లు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని కమిటీ సభ్యులు ప్రకటించారు.  పోటీల్లో  మొత్తం 28 టీములు పాల్గొన్నాయి.   
మరిన్ని వార్తలు