హామీలను మరిచిన కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

హామీలను మరిచిన కేసీఆర్‌

Published Wed, Dec 28 2016 3:34 AM

హామీలను మరిచిన కేసీఆర్‌ - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
గొల్లపల్లి: సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి తన కుటుంబ సంక్షేమం కోసం పాటు పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించా రు. మంగళవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో చేపట్టిన మహా పాద యాత్రలో ఆయన మాట్లాడారు. సామాజిక తరగతులకు విద్య, వైద్యం అందుబాటులో లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో చేతివృత్తులు దెబ్బతిని పట్టణాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని.. వృత్తినే నమ్ముకున్న వారి పొట్టగడవక ఇబ్బం దులు పడుతున్నారన్నారు.

దీనికి ప్రధాన బాధ్యత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాల మాదిరే  సీఎం కేసీఆర్‌ ప్రజా ఉద్యమాలను అణచడానికి కుట్ర పన్నుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతుల ప్రజలు అభివృద్ధి చెందకుండా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. విద్య, ఉద్యో గం ఆర్థిక, పారిశ్రామిక రాజకీయ రంగాల్లో దళిత, బడుగు, బలహీనవర్గాలు.. అగ్రవర్ణాల ఆధిపత్యంలో పూర్తిగా వెనకబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్‌ సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తోందని విమర్శించారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో మహాజన పాదయాత్ర ప్రవేశించింది.

Advertisement
Advertisement