ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం

Published Wed, Jan 4 2017 10:50 PM

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం - Sakshi

సీపీఐ జిల్లా కార్యదర్శి గౌతమ్‌ గోవర్ధన్..
ఎలిగేడు : ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గౌతమ్‌ గోవర్ధన్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధాలను ఎప్పటికప్పుడు ఎంగడుతున్నామన్నారు. కేంద్రం నల్లధనాన్ని వెలలికితీసి పేదలకు పంచుతామని పెద్దనోట్లను రద్దుచేయడంతో పేదలకు కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. నోట్ల రద్దులో మృతిచెందిన 200 కుటుంబాలకు  పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  ఆత్మహత్యలులేని, స్ట్రైక్‌లు లేని బాధలు లేని రాష్ట్రంగా చేసుకోవచ్చునని చెప్పి అన్నివర్గాల ప్రజల మద్దతుతో  గెలిచిన  సీఎం కేసీర్‌  హామీలను నెరవేర్చడం లో విఫలమయ్యారని ఆరోపించారు.

సీపీఐ కార్యకర్తల సహకారంతో ఈనెల 31వరకు పార్టీ సభ్యత్వ నమోదును చేస్తూ ఇంటింటికి, గడప, గడపకు సీపీఐ పేరుతో ప్రజాసమస్యలపై పోరాటంచేస్తామన్నారు. నాయకులు తాండ్ర సదానందం, కొక్కిస రవీందర్‌గౌడ్, సదానందం,  మల్లేశం, అర్కటి రాజయ్య, జమాలొద్దీన్,  పొద్దుటూరి భూమారెడ్డి, పాండురెడ్డి, రాజేశం పాల్గొన్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement