కల్వర్టు పైనుంచి పడి బాలిక మృతి | Sakshi
Sakshi News home page

కల్వర్టు పైనుంచి పడి బాలిక మృతి

Published Sun, Sep 4 2016 11:55 PM

The death of a girl lying on top kalvartu

మహబూబాబాద్‌ : కల్వర్టు పై నుంచి పడటంతో బలమైన గా యాలై గుర్తు తెలియని బాలిక(16) మృతిచెందిన సంఘటన మానుకోటలోని కురవి రోడ్‌ ఆర్‌ఓబీ వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. టౌన్‌ సీఐ నం దిరామ్‌ నాయక్‌ కథనం ప్రకా రం.. కోతులు పట్టేందుకు వచ్చిన కొన్ని కుటుంబాలు కురవి రోడ్‌లో డేరాలు వేసుకొని నివసించేవి.
 
ఇటీవల వారు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. వారికి సంబంధించిన బాలిక మతిస్థిమితం లేకపోవడంతో కల్వర్టు పైనుంచి పడి మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement