రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం

Published Sat, Dec 3 2016 2:48 AM

రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం

వాహనాల కొనుగోళ్లకు ముందుకురాని ప్రజలు
విజయనగరం ఫోర్ట్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం వాహనకొనుగోళ్లపై పడింది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో చేతిలో డబ్బులు లేకపోవడంతో వాహనాల కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. నవంబర్ 8 వరకు కొనుగోళ్లు ఆశాజనకంగా జరిగినా, ఆ తర్వాత నెమ్మదించారుు. కొంతమంది కొనుగోళ్లు చేస్తున్నా పూర్తిస్థారుు ఫైనాన్‌‌స తీసుకుంటున్నారు. అక్టోబర్ కంటే నవంబర్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గింది. అక్టోబర్‌లో 1014 రిజిస్ట్రేషన్లు జరగ్గా, నవంబర్‌లో 820 జరిగారుు. ఇందులో కూడా సుమారు 500 వరకు రిజిస్ట్రేషన్లు నవంబర్ 8వ తేదీకి ముందు జరిగినవే.

 ఫైనాన్సర్లను ఆశ్రరుుస్తున్న కొనుగోలుదారులు
 చేతిలో డబ్బులు లేకపోవడంతో వాహనదారులు పూర్తిస్థారుు ఫైనాన్‌‌సపై వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. షోరూం యజమానులు కూడా కేవలం నాలుగైదు వేల రూపాయలు కట్టినా వాహనాలు ఇచ్చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వాహనాలు కొనుగోలు మందగించడంతో షోరూంలు వెలవెలబోతున్నారుు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement