గురివింద చంద్రం అసలు రూపం | Sakshi
Sakshi News home page

గురివింద చంద్రం అసలు రూపం

Published Tue, Mar 8 2016 4:02 AM

గురివింద చంద్రం అసలు రూపం - Sakshi

నీతిపరుణ్ణి... నిజాయితీకి నేను మారుపేరు... విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నా.... మాటతప్పను.. నాకు ఉన్నదే క్యారెక్టర్...అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నా....
 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమధ్య వీటిని పదేపదే వల్లెవేస్తున్నారు.
ఈ నేతిబీర పలుకుల్లో నెయ్యి ఎంత ఉందో చూద్దామా...!!

 
నీతిపరుణ్ణి.. నిజాయితీకి మారుపేరు నేను

మరి రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఆస్తులెలా పెరిగాయి?
ఎమ్మెల్యేకి రూ. 30 కోట్లు ఇవ్వగలిగినన్ని ఆస్తులెక్కడివి?
రూ. 2,500 కోట్ల టర్నోవర్‌తో దేశంలోని అన్ని నగరాల్లో హెరిటేజ్ మాల్స్ ఎలా వచ్చాయి?
నీతిపరుడివైతే అన్ని ఆరోపణలేమిటి? అన్ని కేసులేమిటి?
ఏ కేసులోనూ విచారణకు సిద్ధపడకపోవడమేనా నిజాయితీ?
 
రాజకీయాల్లో విలువల కోసం పాటుపడుతున్నా..
రాజకీయాల్లో విలువలంటే ఓటుకు రూ. 500 నోటు పరిచయం చేయడమా?
ఎమ్మెల్యేలతో వైశ్రాయ్ క్యాంపులు నడిపి దొడ్డిదారిన పీఠం కైవసం చేసుకోవడమా?
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఇతర ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి కొనుగోళ్లు జరపడమా?
తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికినా బుకాయించడమా?
సైద్ధాంతిక నిబద్ధత ఉందా..? బీజేపీ, లెఫ్ట్, టీఆర్‌ఎస్‌తో అవకాశవాద పొత్తులే నిదర్శనం కాదా?
 
ఆడినమాట తప్పను..
ఇచ్చిన మాటపై జీవితంలో ఎప్పుడన్నా నిలబడ్డారా?
రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలేమయ్యాయి?
‘పథకాలపై ఆధారపడొద్దు.. ప్రత్యామ్నాయం చూసుకోండి’ అనడమా మాటపై నిలబడడమంటే?
కాపుల రిజర్వేషన్, బోయలను ఎస్టీలలో చేర్చడం, వర్గీకరణపై ఇన్ని కప్పదాట్లు ఎందుకు?
 
నాకు ఉన్నదే క్యారెక్టర్...
మీ దృష్టిలో క్యారెక్టర్ అంటే అర్ధమేమిటి?
నమ్మినవాళ్లను మోసం చేయడమా? వెన్నుపోటు పొడవడమా?
అధికారమే పరమావధిగా డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడమా?
రైతులను, ఎస్సీలను, మహిళలను, మురికివాడల్లో నివసించే పేదలను కించపరచడమా?
 సమస్యను పక్కదారి పట్టించడం.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పబ్బం గడపడమా?
 
అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నా..
మీ స్థాయి ఆస్తులెవరికి ఉన్నాయి?
ఖరీదైన భవంతులు..ఊరూరా హెరిటేజ్ వ్యాపారాలు... సింగపూర్‌లో వ్యాపార స్నేహాలు..
కాలు కదిపితే ప్రత్యేక విమానం, పక్క జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్, అమెరికా అధ్యక్షుడికి కూడా లేనన్ని సదుపాయాలతో ప్రత్యేక బస్సు సామాన్యులకు సాధ్యమా?
 అమరావతిలో మీ నివాసం లింగమనేని ఎస్టేట్స్‌లో ఉన్నన్ని హంగులెవరికి ఉన్నాయి?
 
 తప్పు చేయలేదు.. చేయను...
తప్పు మీద తప్పు చేయడం.. అడ్డంగా దొరికిపోయినా ఎదురుదాడి చేయడం మీ నైజం కాదా?
కాపు నాయకులను హత్య చేయించడంపై కన్నాతో సహా ఎంతమంది చెప్పలేదు?
కుల రాజకీయాలపై యూనివర్సిటీలోనే మీరు గోల్డ్ మెడల్ సంపాదించలేదా?
26 కేసుల్లో మీపై విచారణలు జరగడం.. వాటిపై మీరు స్టే తెచ్చుకోవడం నిజంకాదా?
ఏ తప్పూ చేయకుండా రెండెకరాలతో రెండు లక్షల కోట్లు ఎలా ఆర్జించారో?
 
 లోకేశ్..రాజకీయ లెగసీ..
కొడుకును పద్ధతిగా పెంచితే చదువుకునే వయసులోనే అన్ని ఆరోపణలెందుకొచ్చాయి?
ఇంటర్‌లో అత్తెసరు మార్కులతో స్టాన్‌ఫోర్డ్ సీటెలా వచ్చింది?
అమెరికాలో వేసిన వేషాలపై సోషల్‌మీడియాలో ఫొటోలమాటేమిటి?
ఈవీఎంల దొంగతో స్నేహం చేయడం అతనికి ఐటీవింగ్ బాధ్యతలివ్వడం నిజంకాదా?
జీహెచ్‌ఎంసీ ఎన్నికలో ఒక్కసీటు సాధించడమా రాజకీయాల్లో లోకేష్ లెగసీ?
 
బాబూ మీ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మేనేజ్ చేయడం
వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేయడంలో మీకు మీరే సాటి. పాతాళానికైనా దిగజారి పనిజరిగేలా చూసుకోవడంలో మీరు సిద్ధహస్తులు.
ఎల్లకాలం మేనేజ్ చేస్తూనే శిఖరాగ్రాన కొనసాగవచ్చని నిరూపించిన ఘనా పాటి మీరు. శతకకారుల అంచనా లకు కూడా అందని ఘనత మీది.
 
 అబద్ధాలు
అబద్ధాలే జీవితమనుకుంటూ అబద్దాలను ఆశ, శ్వాసగా భావిస్తూ.. కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో అబద్ధాలాడడం మీకే చెల్లింది.
ఎన్ని అబద్ధాలాడినా, మోసగించినా ప్రజా జీవితంలో కొనసాగవచ్చు అనడానికి మీ 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ప్రత్యక్ష నిదర్శనం.
 
 గోబెల్స్ ప్రచారం
మీ వందిమాగధులుగా వ్యవహరించే ఎల్లో మీడియా వెన్నుదన్నుతో అబద్ధా న్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా నమ్మించగలిగిన అపర గోబెల్స్‌మీరు.
మీ గోబెల్స్ ప్రచారం అనన్య సామా న్యమైనది. ఇలాంటి ప్రచారాలతో ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం మీరు చేసినంతగా మరెవ్వరూ చేయలేరు.

Advertisement
Advertisement